న్యూస్ సినిమా

Bheemlaa nayak: పవన్ – రానా దిగుతున్నారు..ఇక అందరి కళ్ళు వీరి మీదే..

Share

Bheemlaa nayak: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ మూవీ భీమ్లా నాయక్. భాయీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాకు యంగ్ డైరెక్టర్ సాగర్ కె చందర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైనమెంట్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన అయ్యప్పనుమ్ కొషియుమ్ సినిమాకు తెలుగులో అఫీషియల్ రీమేక్‌గా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా మలయాళ మూవీ రీమేక్ అయినా దర్శక, రచయిత త్రివిక్రమ్ ఆ ఫీల్ లేకుండా సినిమాను స్క్రీన్, ప్లే డైలాగ్స్ రాశారు.

bheemlaa-nayak promotions are about to start
bheemlaa-nayak promotions are about to start

ఇప్పటికే భీమ్లా నాయక్ పోస్టర్స్ అన్నీ విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక సాంగ్స్‌తో అయితే రికార్డులే రికార్డులు క్రియేట్ చేస్తూ సినిమా మీద భారీ స్థాయిలో అంచనాలను పెంచుతోంది. అయితే అసలు కథ ఇప్పుడు మొదలవబోతోంది. భీమ్లా నాయక్ సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12న భారీ స్థాయిలో రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టేందుకు రంగం సిద్దమవుతోంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ పూర్తైంది. ఇక మేకర్స్ దృష్ఠి మొత్తం సినిమాను ప్రమోట్ చేయడం మీదే పెట్టబోతున్నారు.

Bheemlaa nayak: ఇక పవన్ మ్యానియా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.

ఇప్పటి వరకు అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా, రాజమౌళి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఇకపై భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్ – రానా తమ సినిమాతో దిగుతున్నారు. భారీ స్థాయిలో ప్రమోషన్ మొదలుపెట్టనున్నారు. ఈ నెలలో రెండు సాంగ్స్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి పవన్ కళ్యాణ్ పాట ఉండటం విశేషం. ఇక ఈ నెల 14న రానా బర్త్ డే సందర్భంగా డానియెల్ శేఖర్ టీజర్ రాబోతోంది. ఇక పవన్ మ్యానియా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి. థమన్ సంగీతం అందిస్తున్నాడు. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హిరోయిన్‌గా నటిస్తున్నారు.


Share

Related posts

రెండో రోజు ఏపి అసెంబ్లీ నుండి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

somaraju sharma

తండ్రిని దారుణంగా చంపిన కూతురు.. కారణం తెలిస్తే షాక్!

Teja

అన్ని ర‌కాల దోమ‌లు మ‌నుషుల‌ను కుడ‌తాయా ?

Srikanth A