Subscribe for notification

Bhuma Akhila Priya: టీడీపీ మాజీ మంత్రి అఖిల ప్రియకు ‘బాబు’ భరోసా ఇవ్వలేదా..?

Share

Bhuma Akhila Priya: కర్నూలు జిల్లా నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో భూమా ఫ్యామిలీకి గట్టి పట్టు ఉంది. అయితే భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి మృతి తరువాత కుటుంబంలో విబేధాలు ఏర్పడ్డాయి. టీడీపీ తరపున నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల నుండి ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా బ్రహ్మానందరెడ్డి, భూమా అఖిలప్రియలు 2019 ఎన్నికల్లో దాదాపు 30వేల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఉప ఎన్నికల్లో గెలిచిన భూమా అఖిలప్రియకు చంద్రబాబు మంత్రివర్గంలోకి తీసుకుని పర్యాటక శాఖ అప్పగించారు. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం భూమా అఖిలప్రియ, ఆమె భర్త, సోదరుడు హైదరాబాద్ లోని ఓ లాండ్ సెటిల్ మెంట్ కేసులో అరెస్టు అయిన సంగతి తెలిసిందే. మరో పక్క భూమా కుటుంబీకుల్లో అఖిలప్రియ టీడీపీలో ఉండగా, భూమా కిషోర్ రెడ్డి బీజేపీలో మరి కొందరు వైసీపీలో ఉన్నారు.

Bhuma Akhila Priya allagadda

క్లారిటీ కోసం ప్రయత్నించి..?

రాబోయే ఎన్నికల్లో అఖిల ప్రియకు టీడీపీ టికెట్ వచ్చే అవకాశం లేదనీ, భూమా కుటుంబంలోనే మరొకరికి చంద్రబాబు అవకాశం ఇస్తారని ప్రచారం జరుగుతోంది. తన టికెట్ విషయంలో అటువంటి అనుమానమే అవసరం లేదని క్యాడర్ వద్ద అఖిలప్రియ పేర్కొన్నారుట. రీసెంట్ గా బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చి సందర్భంలో ఆళ్లగడ్డ సీటు విషయంలో క్లారిటీ కోసం ప్రయత్నించి భంగపడినట్లు వార్తలు వినబడుతున్నాయి. నంద్యాల జిల్లాలో చంద్రబాబు ప్రవేశించిన సమయంలో చాగలమర్రి వద్ద భూమా అఖిలప్రియ స్వాగతం పలికారు. ఆ సందర్భంలో కొందరిని పార్టీలో చేర్పించి పార్టీ కండువా కప్పించారు. అదే సందర్భంలో ఓ మాజీ మంత్రి సిఫార్సుతో ఆళ్లగడ్డ అభ్యర్ధిత్వం ఖరారుపై చంద్రబాబు ద్వారా ప్రకటన చేయించుకోవాలని ప్రయత్నించారుట.

సమావేశానికి అఖిలప్రియ గైర్హాజరు

అయితే చంద్రబాబు రాబోయే ఎన్నికలకు సంబంధించి అభ్యర్ధుల ఎంపిక మొత్తం సర్వే నివేదికల ఆధారంగా చేయాలని ఫిక్స్ అయి ఉన్నందున ఇప్పుడే దానిపై ఏమి మాట్లాడలేదుట. దీంతో అఖిలప్రియ మనస్థాపానికి గురైనట్లు ప్రచారం జరుగుతోంది. చాగలమర్రి తరువాత చంద్రబాబు పర్యటనలో అఖిలప్రియ, ఆమె సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డిలు .కనబడకపోవడం, కర్నూలులో చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి భూమా అఖిలప్రియ గైర్హాజరు కావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమావేశంలో భూమా బ్రహ్మానందరెడ్డి పాల్గొన్నట్లు తెలుస్తొంది. ప్రస్తుతానికి ఆళ్లగడ్డకు భూమా అఖిలప్రియ, నంద్యాలకు భూమా బ్రహ్మానందరెడ్డిలు పార్టీ ఇన్ చార్జిలుగా వ్యవహరిస్తున్నారు. ఈ రెెండేళ్లలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజల్లో అనుకూలత తదితర అంశాలతో పాటు సర్వే రిపోర్టుల ఆధారంగా చంద్రబాబు వీరికే టికెట్లు ఖరారు చేస్తారా లేక మార్పులు చేస్తారా అనేది తేలుతుంది.


Share
somaraju sharma

Recent Posts

Virata Parvam-Vikram: ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `విక్ర‌మ్‌`, `విరాట ప‌ర్వం`..ఇవిగో స్ట్రీమింగ్ డేట్స్‌!

Virata Parvam-Vikram: క‌రోనా వ‌చ్చిన త‌ర్వాత ఓటీటీల హ‌వా ఏ స్థాయిలో పెరిగిందో ప్రత్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ప్ర‌స్తుతం థియేట‌ర్స్‌లో…

31 mins ago

Mango: మామిడి పండ్లు తిన్న వెంటనే వీటిని తినకూడదు.. తింటే ఏం జరుగుతుందంటే.!?

Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…

2 hours ago

Hero Ram: ప్రియురాలితో పెళ్లి.. ఫుల్ క్లారిటీ ఇచ్చిన రామ్‌!

Hero Ram: టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీట‌లెక్క‌బోతున్నాడంటూ గ‌త కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…

2 hours ago

AP Employees: జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ము మాయంపై ఆర్ధిక శాఖ ఉన్నతాధికారిని కలిసిన ఏపి ఉద్యోగ సంఘాల నేతలు… అసలు విషయం ఇదీ

AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…

2 hours ago

Rice Idly: మిగిలిన అన్నం పరేయకుండా క్షణాల్లో మెత్తటి ఇడ్లీ చేసేయండీలా..!

Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…

3 hours ago

Bihar Politics: ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చిన నలుగురు బీహారీ ముస్లిం నేతలు

Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…

3 hours ago