తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 మొదలవడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ విషయం అధికారికంగా వెల్లడించిన సంగతి తెలిసిందే. అసలు ఈ సారి బిగ్ బాస్ ఉంటుందా లేదా అన్న డైలమాలో ఉన్న ప్రేక్షకులు సీజన్ ఉందని కన్ఫర్మ్ చేస్తూ ప్రోమో వదిలారు. ఆ తర్వాత సీజన్ 4 కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించనున్నాడని.. సస్పెన్స్ లో ఉన్న జనాలకి సర్ప్రైజ్ ఇచ్చారు.
ఈ క్రమంలో ఇప్పటికే నాగార్జున త్రిపాత్రాభినయంలో ప్రోమోని రిలీజ్ చేశారు. అయితే బిగ్ బాస్ మొదలయ్యోది ఎప్పుడు అన్న విషయం.. అంటే డేట్ మాత్రం ఇంకా వెల్లడించకపోవడంతో ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 28 లేదా 29 నుంచి సీజన్ 4 మొదలవబోతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ రెండు డేట్స్ కాదు .. ఆగస్టు 30 అని ఇప్పుడు అంటున్నారు. దీనికి వికీపీడీయా బలం చేకూర్చింది.
వికీపీడియాలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 పేరుతో ఒక పేజ్ ను క్రియేట్ చేయడం జరిగింది. అది షో నిర్వాహకులే క్రియేట్ చేసి ఉంటారని ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. అందులో బిగ్ బాస్ సీజన్ 4 ఎప్పుడు ప్రారంభం కాబోతుందో డేట్ విషయం క్లియర్ గా రాసి ఉంది. వాస్తవంగా ఈ షోను జూన్ లోనే ప్రారంభించాలని అనుకున్నారట. కాని కరోనా కారణంగా ఆగస్టు 30 నుండి ప్రసారం చేయబోతున్నట్లుగా వికీపీడియాలో పేర్కొన్నారు.
అంతేకాదు ఈ షోను 105 రోజులు నిర్వాహకులు ప్లాన్ చేశారని మొదటగా 15 మంది కంటెస్టెంట్స్ హౌజ్ లోకి వెళ్తారన్న విషయం కూడా వికీపీడియాలో పేర్కొన్నారు. మొత్తానికి షో ప్రారంభంపై ఆగస్టు 30 అంటూ అనధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఇక ఈసారి షో ఫార్మట్ కరోనా కారణంగా కొత్తగా ప్లాన్ చేశారని అంటున్నారు. ఇక ఈ రెండు రోజుల్లో డేట్ కన్ఫర్మ్ చేస్తూ ప్రోమో విడుదల చేస్తారని సమాచారం.