బిగ్బాస్ ఇంటిలో ప్రేమకథలకు ఎలాంటి కొదవ ఉండదు. మొదటి నుండి జంటలు జంటలు గా విడిపోవడం ప్రతి సీజన్లో చూస్తున్నాం. ఇక తాజాగా కెప్టెన్సీ టాస్క్ తర్వాత ఇంటిలో జరిగిన గొడవ పై హారిక, అభిజిత్ విశ్లేషణ మొదలుపెట్టారు. అయితే అలా మొదలైన సంభాషణ క్రమంగా వ్యక్తిగత విషయాల్లో కి వెళ్ళిపోయింది. ముఖ్యంగా హారిక, అభిజిత్ లది బాగా ముదిరింది.
నువ్వు ఇంట్లో వాళ్ళతో క్లోజ్ గా ఉంటున్నావ్…. కానీ నా వద్దకు వచ్చి నువ్వు ఎప్పుడైనా మాట్లాడతావా అని మెహబూబ్ పైన హారిక ముందు కోపం వ్యక్తం చేసింది. ఆ తర్వాత అభిజిత్ ని కూడా ఉద్దేశించి నువ్వు కూడా ఈ మధ్య వాళ్లతోనే ఎక్కువ ఉంటున్నావు…. నాతో మాట్లాడకు అని ఉంది. అయితే హారిక సమాధానం పై సంతృప్తి చెందని అభిజిత్ నువ్వు వాళ్ళు వెళ్లి వాడికి హగ్గులు ఇస్తావు కదా అని అన్నాడు. నేను సోహెల్ కా ఇచ్చేది అని అడిగితే ఏమో నాకు ఏమి తెలుసు అని అన్నాడు.
ఓహో నువ్వు అనేది అఖిల్ గురించా అని ఇక అన్నప్పుడు ఏమో నాకు తెలియదు అని అభిజిత్ అలిగినంత పని చేశాడు. అంతటితో ఆగకుండా నువ్వు నాకు కౌగిలింత ఇచ్చి ఎన్ని రోజులు అయిందో తెలుసా అంటూ గుడ్ మార్నింగ్ హగ్ నాకు ఎవరు ఇచ్చారు అంటూ హారిక అభిజిత్ ను ప్రశ్నించింది. నువ్వు నాకు హగ్ ఇచ్చి చాలా రోజులు అయింది అని అన్నాడు.
దానికి బదులు ఇస్తూ ఇప్పుడు నేను నీకు ఇస్తే కుర్చీ పైన నుండి కింద పడిపోతావు అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చింది. తర్వాత నువ్వు నన్ను ఎప్పుడు తిడుతున్నావు…. అందుకే నేను దూరంగా ఉన్నాను. ఈ వారం మనం ఎక్కువ గొడవ పడలేదు లేకపోతే నువ్వు నాపై ఎప్పుడు అరుస్తూ ఉంటారు అంటూ అభిజిత్ తో హారిక తన బాధ చెప్పుకొంది. అయితే నాకు నువ్వు మోనాల్ లా కాదు…. నాకు మోనాల్ పై జీరో ఫీలొంగ్, కానీ అలాంటి ఫీలింగ్ నీమీద మాత్రం రాలేదు అని అభిజిత్ అన్నాడు
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!