బిగ్ బాస్ 4 : టైటిల్ సాధించడానికి అభిజిత్ అసలు అర్హుడేనా…?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఫైనల్ కు చేరుకునే టాప్ 3 కంటెస్టెంట్ లో అభిజిత్ కచ్చితంగా అభిజిత్ ఉంటాడని తెలిసిందే. అతను విన్నర్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. బిగ్బాస్ 2 లో కౌశల్ తర్వాత అభిజిత్ కే విపరీతంగా బయట ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అతనికి సపోర్ట్ చేస్తున్న కొన్ని గ్రూపులు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అయితే ఈసారి బిగ్ బాస్ కి గత సీజన్లో తో పోలిస్తే చాలా వరకు వీక్ అని చెప్పాలి. వీరందరిలో అభిజిత్ కి చాలా అడ్వాంటేజ్ ఉన్నాయి అన్న విషయాన్ని ఎవరూ కాదనలేరు.

 

అతని గుడ్ లుక్స్,  లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ లాంతి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంలో పూర్తి స్థాయి హీరో అదే సినిమాలో నాగార్జున భార్య అమల నటించడం బాగా ప్రాచుర్యం పొందిన వెబ్ సిరీస్ లో హీరోగా చేయడం అతని ప్లస్ పాయింట్స్. 32 ఏళ్ల అభిజిత్  కి పరిపక్వత కూడా బాగా ఉంది. అమ్మ రాజశేఖర్, గంగవ్వ, కరాటే కళ్యాణి లాంటి సీనియర్ బ్యాచ్ ను పక్కనపెడితే మిగతా అందరూ అతను అనుభవంలో అవకాశాన్ని అందిపుచ్చుకోవడంలో ముందు ఉంటాడు. ఇక ఈ సీజన్లో ఒక్క చోట కూడా అభిజిత్ అసలు నెగిటివిటీని మూటగట్టుకొనలేదు కానీ టాస్కుల్లో అంత యాక్టివ్ గా లేకపోయినా తన పని తాను చేసుకుంటూ ఎంతో చాకచక్యంగా వ్యవహరిస్తూ గెలుపు గుర్రం ఎక్కేసా.

అయితే ఒకానొక సమయంలో జరిగిన వాదనలో తను బాగా ఎడ్యుకేటెడ్ అని చెప్పడం మిగతా వారిని తక్కువ చేసి చూడటం కొద్దిగా విమర్శలు ఉన్నాయి గాని తర్వాత తన తప్పులను సరిదిద్దుకుని ఇంక అలా మాట్లాడలేడని అంటారు. ఇక కొద్ది మంది సభ్యులతో తప్పితే మిగిలిన వారికి దూరంగా ఉంటాడు…. ఒక మూల ఎప్పుడు కూర్చొని ఉంటాడు అని అంటారు…. గొడవలు జరిగినప్పుడు లేదా ఏదైనా వాదన తెరమీదకు వచ్చినప్పుడు అభిజిత్ పెద్దగా వారితో కలిసి తమ అభిప్రాయాలను పంచుకోకుండా సేఫ్ గా పక్కన ఉంటాడు అని తెలిసిందే ఇక రేటింగ్స్ పరంగా కంటెస్టెంట్స్ కంటే అభిజిత్ ఎంతో ముందు ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే అభిజిత్ టాస్క్ లో ఏమాత్రం పార్టిసిపేట్ చేయడు, అది చాలా పెద్ద మైనస్ కానీ అది మాత్రం అతని పై పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. మొన్న ఒక టాస్క్ లో తన ఆత్మాభిమానం దెబ్బతింటుందని వైదొలగడం విశేషం. దానికి నాగార్జున చివాట్లు పెట్టాడు కానీ అది అభిజిత్ పై అంత ప్రభావం చూపలేదు. ఇక అభిజిత్ నిజంగా బిగ్ బాస్ టైటిల్ సాధించడానికి అర్హుడేనా అంటే.. దానికి సమాధానం కోసం చివరి వరకు వేచి చూడాల్సిందే.