బిగ్ బాస్ ఇంటిలో అందరిదీ ఒక బాధ అయితే హారిక ది మాత్రం మరొక బాధ. తనకి ఏం కష్టం వచ్చినా కెమెరా ముందు వెళ్లి తన గోడు వెళ్లబోసుకుంటుంది. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇలాగే చేసింది. అప్పట్లో నామినేషన్ విషయంలో అభిజిత్ హారిక మధ్య బిగ్ బాస్ చిచ్చు పెట్టాడని తర్వాత స్టార్ హోటల్ టాస్క్ లో కూడా అతను ఇష్టపూర్వకంగా ఒక స్టార్ రేటింగ్ ఇచ్చినా మిగతావి బలవంతంగా లాక్కున్నాడు అని కంప్లైంట్ చేసింది. ఇలా ప్రతి ఒక్క విషయాన్ని ఇంటిలో కెమెరాలు ముందుకెళ్ళి హారిక చెప్పుకుంటుంది.
దీనిని కొంతమంది స్ట్రాటెజీ అంటారు… మరి కొంతమంది అతి చేయడం అంటారు. అలాగే తమ అభిప్రాయాలను ప్రేక్షకులకు వెల్లడించడానికి కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడం సరికాదు అని మరికొందరి అభిప్రాయం. అయితే హారిక మాత్రం తరచూ ఇలాగే చేస్తూ ఉంటుంది. మొత్తానికి విషయం ఏమిటంటే నిన్న ఇంటిలో ఈ కరోనా కష్టకాలంలో హైజీనిక్ ప్రాడక్ట్స్ అవసరం గురించి వివరించడం జరిగింది. అయితే ఇక్కడ తన తెలివిని ప్రదర్శించాలని హారిక కెమెరా ముందుకు వెళ్లి కష్టకాలంలో పరిశుభ్రంగా జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమో అందరికీ చెప్పింది.
ఇటువంటి ప్రాడక్ట్స్ ను వాడడం వలన క్రిములను 99.99% నివారించవచ్చు అని తెలిపింది. ఆమె… ఇక మిగిలిన ఒక్క శాతం కూడా మన చేతుల్లో ఉందని…. మనం జాగ్రత్తగా ఉంటే ఆ ముప్పుని కూడా తప్పించుకోవచ్చని తెలిపింది. అయితే ఇక్కడ హారిక పప్పులో కాలు వేసింది. 99.99 శాతం అంటే మిగిలినది ఒక శాతం కాదు అని ఆమె గ్రహించలేక పోయింది. 0.01 శాతం అని చెప్పకుండా ఒక శాతం అని చెప్పడంతో నెటిజన్లు ఆమెపై ట్రోల్స్ వేయడం మొదలుపెట్టారు. ఇలా మరొకసారి ఇంటిలో కెమెరాల ముందుకు వెళ్లి తన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన హారిక ఒక్కసారిగా బిస్కెట్ అయింది.