బిగ్బాస్ ఇంటిలో 9వ వారం చాలా ఆసక్తికరంగా సాగుతోంది. తాజాగా బిగ్ బాస్ ఇచ్చిన ‘పల్లెకు పోదాం చలో చలో’ టాస్క్ లో మెహబూబ్ మళ్లీ రౌడీ అవతారం ఎత్తాడు. పాన్ షాప్ యజమాని అవినాష్ తమ్ముడిగా మెహబూబ్ అందరినీ ఆకట్టుకున్నాడు. గ్రామ పెద్ద కూతురు అయిన అరియానా అలియాస్ వెంకటలక్ష్మి తో అవినాష్ ప్రేమలో పడుతుంటాడు.
అన్న ప్రేమ కు సపోర్ట్ చేసే తమ్ముడిగా మెహబూబ్ కనిపించాడు. అలాగే మెహబూబ్ కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమే హారిక. ఇలా ఇంటిలో అన్నకు తమ్ముడిగా ఊర్లో రౌడీగా ప్రియుడిగా మెహబూబ్ కంప్లీట్ పర్ఫార్మెన్స్ చేసే చాన్స్ వచ్చింది. ఇక ఇదే సమయంలో సిటీ నుండి వచ్చిన కుర్రాడిగా అభిజిత్…. హారిక, మెహబూబ్ ల మధ్య గొడవ పెడతాడు. హారిక అఖిల్ కు లైన్ వేస్తుందని మెహబూబ్ నమ్మించాలని ప్రయత్నించాడు. అయితే మెహబూబ్ మాత్రం హారిక నాకు కాబోయే పెళ్ళాం అని…. పదిరోజుల్లో మేము పెళ్లిచేసుకోబోతున్నాం…. తన జోలికి వస్తే జాగ్రత్త అంటూ హారిక ను కౌగిలించుకొని రొమాన్స్ పండించాడు.
అతని పర్ఫార్మెన్స్ చూసి నిజంగానే వారిద్దరు లవర్స్ అన్నట్లు మెహబూబ్ పండించాడు .ఇక తన అన్నకు తోడుగా ఉండే మెహబూబా ఇంట్లో హోమం ఆగిపోయేలా కొన్ని ఎత్తులు వేస్తున్నాడు, కట్టెలు దొంగలించాడు. నీళ్ళు పోసాడు ఎందుకంటే ఈ బాగా పర్ఫార్మెన్స్ చేసిన వారు కెప్టెన్సీ టాస్క్ కి అర్హులు అని ప్రకటించారు. దీంతో ఎవరి స్టైల్లో వాళ్లు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. బాగా సరదాగా నవ్వులతో కొనసాగుతోంది. ఇక ఈరోజుటి ఎపిసోడ్ లో ఏమవుతుందో చూడాలి.