తెలుగు ..హిందీ..తమిళంలో బిగ్ రియాలిటి షో గా బిగ్ బాస్ షో కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. హిందీలో అయితే ఇప్పటికే 13 సీజన్లు కంప్లీట్ చేసుకుంది. ఇక తెలుగు ప్రేక్షకులందరు ఈ షో కి ఎంతగానో అట్రాక్ట్ అయ్యారన్న సంగతి తెలిసందే. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో ప్రారంభం కాబోతుంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన సీజన్ 4 ప్రోమో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది. నాగార్జున త్రిపాత్రాభినయంతో టెలికాస్ట్ అవుతున్న బిగ్ బాస్ 4 ప్రోమోతో షో ఎలా ఉండబోతుందో అన్న అంచనాలకి వచ్చేశారు.
అంతేకాదు ప్రేక్షకులకి ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ మీద కూడా విపరీతమైన క్యూరియాసిటీ పెరిగింది. ఎవరెవరు సీజన్ 4 లో పాల్గొనబోతున్నారన్న ఆసక్తి ప్రేక్షకుల్లో రోజు రోజుకీ మరీ పెరిగిపోతుంది. ఇప్పటికే ఈ షోలో బిత్తిరి సత్తి, రష్మీ, సుధీర్, అనసూయ, సినీ నటి ప్రగతి, ప్రముఖ ఛానల్ లో పనిచేసే న్యూస్ రీడర్, టాప్ యాంకర్ కం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనసూయ ఇలా చాలా పేర్లు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే ఇప్పుడు నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఈ కొత్త సీజన్ లో పాల్గొనబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంత వరకు నిజముందో తెల్యదు గాని.. నిజంగా ఈసారి హౌజ్ లో బండ్ల గణేష్ ఉంటే మాత్రం ఫుల్ ఫన్ ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి ఎంటర్టైన్మెంట్స్ ఉంటుందని చెప్పుకుంటున్నారు. అందుకు కారణం బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కి డై హార్ట్ ఫ్యాన్.
కాబట్టి హౌజ్ మెట్స్ తో పవర్ స్టార్ గురించి బోలెడన్ని విషయాలు పంచుకుంటాడని భావిస్తున్నారు. ఆరకంగా పవర్ స్టార్ గురించి ప్రేక్షకులకి చాలా తెలిసే అవకాశం ఉంది. మరి నిర్వాహకులు బండ్ల గణేష్ ని సెలెక్ట్ చేశారా లేదా మరికొన్ని రోజుల్లో తెలియనుంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ ఆగస్టు చివరి వారం నుంచి సీజన్ 4 మొదలవుతుందని తెలుస్తోంది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!