బిగ్‌బాస్ ఇంటిలో శనివారం ఎపిసోడ్ కు వేళ అయింది. ఈవారం ఇంట్లో ఎన్నో ఆసక్తికర విషయాలు చోటుచేసుకున్నాయి. అమ్మరాజశేఖర్ కేంద్రంగా మిగతా సభ్యులు రెచ్చిపోయారు. నామినేషన్ ప్రక్రియ దగ్గర మొదలైన రగడ టాస్క్‌లు, కెప్టెన్సీ టాస్క్ దాకా కొనసాగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకోవడం విభేదాలకు పోవడం వంటివి కీలకంగా జరిగాయి. ఈ సందర్భంగా నాగార్జున శనివారం ప్రతి ఒక్కరిని అనేక రకాలుగా నిలదీశాడు.
మొదటిగా అభిజిత్ దగ్గరకు వెళ్ళిన నాగార్జున సెల్ఫ్ రెస్పెక్ట్ కోసం నువ్వు గేమ్ ఆడక పోవడం ఏమిటి అని ప్రశ్నించాడు. అంటే ఇంటిలో నీ ఒక్కడికే సెల్ఫ్ రెస్పెక్ట్ ఉందా…? మిగతా ఎవరికీ లేదా అని నిలదీశాడు. దానికి అభిజిత్ చాలా తెలివిగా…. నేను ఆ మాట నా ఒక్కడి కోసం అనలేదు…. ఇంటిలో ప్రతి ఒక్కరి తరఫున మాట్లాడాను నాకు అందులో సెల్ఫ్ రెస్పెక్ట్ గా కనిపించలేదు అని అన్నాడు.
అప్పుడు నాగార్జున ఇంటి సభ్యులందరినీ ఉద్దేశించి ఆత్మాభిమానం కోసం టాస్క్ వదిలేయడం తప్పా… కరెక్టా చేతులు ఎత్తండి అని అన్నాడు. ఎవ్వరూ ఆ విషయంలో అభి కి సపోర్ట్ చేయకపోవడం గమనార్హం. దీంతో ప్రేక్షకులకు అభికిత్ సామర్థ్యం అనుమానాలు రావడం మొదలయ్యాయి.
అభి మొదటినుండి టాస్క్ ల విషయంలో వచ్చేటప్పటికీ యాక్టివ్ గా ఉండటం లేదు. ఫిజికల్ టాస్క్‌లు అయితే అసలు పార్టిసిపేట్ చేసిన దాఖలాలు లేవు. అటువంటి అభిజిత్ ఈ టైటిల్ గెలవడం అనేది చాలా కష్టమైన విషయమే…. దీన్ని నాగార్జున ఎత్తి మరీ చూపించడం విశేషం.