బిగ్బాస్ ఇంటిలో ‘పల్లెకు పోదాం ఛలో ఛలో’ టాస్కర్ చాలా ఫన్నీగా ఉంటోంది. నిజ జీవితం క్యారెక్టర్లలో ఇమిడిపోయిన ఇంటి సభ్యులు అందరూ ఎవరు ఫర్ఫార్మెన్స్ లో వాళ్ళు ఉన్నారు. గ్రామ పెద్ద అయిన సోహెల్ కు కూతురు గా నటిస్తున్న అరియానా వెంకటలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. దెబ్బకు మిగతా హౌస్మేట్స్ నోటి నుండి మాట రావట్లేదు. ఇంటిలో పాన్ షాపు యజమాని గా కనపడుతున్న అవినాష్ తో వెంకటలక్ష్మి ప్రేమలో పడుతుంది. ఈ విషయం గ్రామంలో తెలిస్తే గ్రామ పెద్ద పరువు పోతుంది అని అరియానా బావ అఖిల్ బాధపడుతూ ఉంటాడు.
ఇదే విషయాన్ని తన అక్క లాస్య తో చెప్పి ఆవేదన చెందుతాడు. వాడితో ప్రేమలో పడడం ఏమిటి అని బాధ పడతాడు. అందుకు నా పరువు పోతుంది అంటే…. అరియానా వచ్చేసి పరువు పోతే మళ్ళీ తిరిగి రమ్మను అంటూ అఖిల్ పై పంచుల వర్షం కురిపిస్తుంది. సర్ది చెప్పవలసిన లాస్య సైతం అరియానా మాటతీరు కు ఒక్కసారిగా ఖంగు తింది. ఆమె వైపు మెచ్చుకోలుగా చూసింది.
అరియానా పంచ్ ల వర్షానికి తట్టుకోలేకపోయిన అఖిల్…. తల్లి నీకు దండం పెడతా ఇక ఆపేసెయ్ అంటూ అన్నాడు. ఒక పక్క అతను మరదలు తో ప్రేమాయణం కొనసాగిస్తున్న విషయం భరించలేక అతని నోరు ఎత్తి మాట్లాడనివ్వకుండా పంచ్ లు వేస్తున్న అరియానా చూసి అఖిల్ బెదిరిపోయాడు. ఇక అవినాష్ తమ్ముడి పాత్రలో మెహబూబ్ అయితే అతనికి మరిన్ని తలనొప్పులు తెచ్చేలా ఉన్నాడు. మెహబూబ్ హారిక లవ్ ట్రాక్ కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. ఇక ఈ టాస్క్ లో పూర్తి స్థాయిలో చేసినవారు కెప్టెన్సీ టాస్క్ కు అర్హత సాధిస్తారు. కాబట్టి అందరూ తమ 100% ఇచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు.