Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ సీజన్ ఫైవ్ సెకండ్ వీక్ కి ఎలిమినేషన్ కి నామినేట్ అయిన సభ్యుల వివరాలు..!!

Share

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లో సీజన్ ఫైవ్ సెకండ్ ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. కంటెస్టెంట్ ఉమాదేవి… భయంకరంగా బండ బూతులు తిట్టడం జరిగింది. ఆమె తిట్టిన తిట్లు కు.. ఇంటిలో సభ్యులంతా ఒక్కసారిగా నోరెళ్లబెట్టారు. ఇదే తరుణంలో శ్వేత భారీగా ఇది గేమ్.. గేమ్ లాగానే ఆడాలని.. ఉమాదేవి.. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఆడవాళ్లు గా ప్రవర్తిస్తే బాగుంటుందని గట్టిగా హెచ్చరించింది. సోమవారం జరిగిన ఎపిసోడ్ లో ఉమా దేవి అదేరీతిలో శ్వేత వ్యవహరించిన తీరు హైలెట్ అయ్యింది. ఇక పూర్తిగా ఎపిసోడ్ పరంగా ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ గమనిస్తే.. ఇంటిలో ఉన్న 18 మంది సభ్యులను.. గద్ద, నక్క..టీమ్స్ గా రెండుగా విభజించడం జరిగింది. నక్క టీములో ఉమాదేవి, లహరి, రవి, జెస్సీ, మానస్‌, సన్నీ, కాజల్‌, శ్వేత, నటరాజ్‌ ఉండగా; గద్ద టీములో లోబో, యానీ మాస్టర్‌, శ్రీరామ్‌, ప్రియ, హమీదా, విశ్వ, సిరి, షణ్ముఖ్‌, ప్రియాంక ఉన్నారు. ఈ క్రమంలో ఎవరైతే ఇంటి సభ్యులను నామినేట్ చేసి బయటకు పంపాలనుకుంటున్నారో ఆ కంటెస్టెంట్‌పై పెయింట్‌ పూయాల్సి ఉంటుంది అని బిగ్బాస్ తెలిపారు.

అయితే ఇంటిసభ్యులు వాళ్ల టీమ్‌ కాకుండా ఇతర టీమ్‌లో నుంచి ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంటుందని మెలిక పెట్టాడు. ఇదే తరుణంలో సిరి కెప్టెన్ కావటంతో… ఆమెకు ఎలిమినేషన్ నుండి మినహాయింపు అని బిగ్బాస్ చెప్పుకొచ్చారు. ఇటువంటి తరుణంలో గేమ్ స్టార్ట్ అవ్వగా… మొదటిగా కెప్టెన్ సిరి చేత ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ కాగా ఆమె ఉమాదేవిని నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ప్రియా నీ అదే రీతిలో .. ప్రియాంక సింగ్ ని నామినేట్ చేశారు. తర్వాత యాని మాస్టర్.. ఉమా దేవి, కాజల్ నీ నామినేట్ చేయడం జరిగింది.

Bigg Boss Telugu 5: These 7 Contestants Nominated For Second Week - Sakshi

సన్నీ టాస్కులో ఇంకా యాక్టివ్ కావాలని…ప్రియ నీ.., ఎప్పుడూ కిచెన్ లోనే ఉంటే.. గేమ్ చాలా మిస్ అవడం జరుగుతుందని ప్రియాంక సింగ్ ని నామినేట్ చేశారు. తర్వాత మానస్ వంతు రాగా… కెప్టెన్సీ టాస్క్ లో తనకి సపోర్ట్ చేయలేదని యాంకర్ లోబో నీ.. అదే రీతిలో ప్రియా ని నామినేట్ చేయడం జరిగింది. ఈ క్రమంలో యాంకర్ లోబో.. నిన్ను సపోర్ట్ చేద్దాం అనుకుంటే నువ్వు హీరో మాదిరిగా యాటిట్యూడ్ చూపిస్తున్నావ్. నా ముందు నువ్వు పిల్ల బచ్చా. లోబో అంటే అది పేరు కాదు బ్రాండ్. పెద్ద పెద్ద హీరోలు నన్ను గుర్తుపడతారు.. అంటూ తన గురించి తాను గొప్పగా చెప్పుకున్నాడు. అనంతరం విశ్వ… ఆలు కూర విషయంలో.. ఉమాదేవి సరిగ్గా వ్యవహరించలేదని ఆమెను నామినేట్ చేయడం జరిగింది. ఆ సమయంలో ఉమా దేవి టెంపర్ లూజ్ అయి.. భయంకరంగా పచ్చి బూతులు తిట్టడం జరిగింది. షణ్ముఖ్ జస్వంత్.. ఇంకా ఏంటి లో ఉన్న చాలామంది ఉమాదేవి చేసిన కామెంట్ లకు షాక్ అయిపోయారు. అనంతరం విశ్వ కాజల్ ని నామినేట్ చేయడం జరిగింది.

లహరి… హ మీద అదే రీతిలో యానీ మాస్టర్ నీ నామినేట్ చేశారు. అనంతరం బరిలోకి దిగిన ఉమాదేవి… ఇంటిలో ఉన్న సభ్యులందరికీ ఊహించని రేంజ్ లో హై ఓల్టేజ్ లో చాలెంజ్ విసిరింది. బుద్ధి బలం దమ్ము ధైర్యం ఉన్న వాళ్లు నాతో గేమ్ ఆడాలని.. ఇంటి సభ్యులకు సవాలు విసిరింది. ఇదే సమయంలో తాను నామినేట్ చేసే సభ్యుల విషయంలో.. నా పుట్టలో వేలు పెడితే నేను ఊరుకుంటానా…అంటూ.. యాని మాస్టర్, విశ్వాన్ని నామినేట్ చేసింది. ఈ క్రమంలో భయంకరంగా బూతులు వ్యక్తిత్వంతో చివరిలో ఉమాదేవికి.. ప్రియాంక సింగ్ కి మధ్య గట్టిగానే ఫైట్ అయింది. పోవే ఉమా. అంటూ ప్రియాంక సింగ్ గట్టిగా వెటకారంగా డైలాగులు వేయడం జరిగింది. అనంతరం లోబో.. శ్వేతా ని రవిని నామినేట్ చేశాడు. ఆ తర్వాత బరిలోకి దిగిన శ్వేత… ఉమాదేవి మాట్లాడే విధానాన్ని ఖండించటం తో పాటు … కొంచెం ఆడవాళ్లు గా ప్రవర్తించాలి అదే రీతిలో మాట తీరు మార్చుకోవాలి అని గట్టిగా ఆవేశ పడి మరి ఏడ్చుకుంటూ డైలాగులు వేసింది.

అనంతరం హమీద..నీ..లోబో నీ .. శ్వేతా నామినేట్ చేయడం జరిగింది. ఇద్దరి కళ్ళల్లో రంగు పడేలా శ్వేతా కొట్టడంతో.. కాసేపు గేమ్ ఆగిపోయింది. అనంతరం మళ్లీ నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ కాగా.. షణ్ముఖ్ జస్వంత్ మీ మాట తీరు.. సరిగా లేదు మీరు కరెక్ట్ ఏమోగానీ హౌస్ కి కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది అంటూ ఉమా దేవి ని నామినేట్ చేశారు. అనంతరం జేసీ ని నామినేట్ చేయడం జరిగింది. కాజల్‌.. యానీ మాస్టర్‌, విశ్వను; జెస్సీ.. విశ్వ, లోబోను; శ్రీరామచంద్ర.. నటరాజ్‌ మాస్టర్‌, వంట రాదని అబద్ధం చెప్పావంటూ కాజల్‌ను నామినేట్‌ చేశారు. దీంతో మరోసారి ఏడ్చేసింది కాజల్‌. ప్రియ.. సేఫ్‌ గేమ్‌ ఆడుతున్నావంటూ సన్నీని, ఆ తర్వాత నటరాజ్‌ మాస్టర్‌ను నామినేట్‌ చేసింది. రవి.. ప్రియాంక సింగ్‌, శ్రీరామచంద్రను నామినేట్‌ చేశాడు. నామినేషన్‌ ప్రక్రియ ముగిసే సమయానికి నక్క టీమ్‌లో నుంచి ఉమా, నటరాజ్‌, కాజల్‌, గద్ద టీమ్‌లో నుంచి లోబో, ప్రియాంక, యానీ, ప్రియ నామినేట్‌ అయినట్లు బిగ్‌బాస్‌ ప్రకటించడం జరిగింది.


Share

Related posts

Job Notification : ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ నోటిఫికేషన్

bharani jella

Ishita Chauhan stylish pics

Gallery Desk

పవన్ కోసం సురేందర్ రెడ్డి సిద్ధం చేసిన స్క్రిప్ట్ ఇదే .. 10 గబ్బర్ సింగ్ లకి సరిపడా హిట్ రాబోతోంది..!

GRK