బిగ్ బాస్ నాలుగో సీజన్ ఆసక్తికరమైన ఆస్తులతో సీక్రెట్ ప్రణాళికలతో చాలా ఆసక్తికరంగా సాగుతోంది. కంటెస్టెంట్స్ విషయంలో కొద్దిగా ఆలోచించి ఒక్కొక్కరిని హైలైట్ చేసి టిఆర్పి పెంచాలని నిర్వాహకులు భావిస్తున్నారు. అయితే అవి ఏవీ పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు.
వీకెండ్స్ మాత్రం టీఆర్పీ భారీగా పెరుగుతోంది. శనివారం అయితే ఒక రేంజ్ లో రేటింగ్ పెరుగుతోంది. మళ్ళీ మామూలు రోజుల్లో యవ్వారం మొదటికి వస్తోంది. నిర్వాహకులు అందుకే ఆసక్తికర టాస్క్ లు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. నాగార్జున వస్తేనే గ్రాఫ్ పెరుగుతోంది. మిగతా రోజుల్లో సగానికిపైగా కిందికి పడిపోతుంది అన్నది మాట. ఈ
సమంత, అఖిల్ వచ్చి రేటింగ్ ఆ మధ్య పెంచారు కానీ ప్రస్తుతం ఫలితం మాత్రం అలాగే ఉంది. ఇలాంటి సమయంలో సుమ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ ఒక ప్రోమో లాంటివి రిలీజ్ చేసిన తర్వాత వచ్చిన హైప్ పెరిగిన పిదప దిగజారిపోయింది. మధ్యలో హైపర్ ఆది వచ్చి వెళ్ళాడు. ఇలాంటి సమయంలో బిగ్ బాస్ లోకి మరో హీరో కూడా రాబోతున్నాడు అనే టాక్ వినిపిస్తోంది.
అక్కినేని నాగార్జున తన పెద్ద కొడుకు నాగచైతన్య ను గెస్ట్ గా పిలవనున్నట్లు సమాచారం. పనిలోపనిగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అతను నటిస్తున్న లవ్ స్టోరీ సినిమా కూడా ప్రమోషన్ చేసినట్టు ఉంటుందని చైతన్య భావిస్తున్నాడట. అందుకే కూల్ గా ఎంట్రీ ఇచ్చేందుకు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది, ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది