Big Breaking: ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి ముందే గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్, ఫిట్ మెంట్ 23 శాతం, పదవీ విరమణ వయసు పెంపు..

Big Breaking ap cm jagan announced employees prc
Share

Big Breaking: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు సంక్రాంతి పండుగకు ముందే గుడ్ న్యూస్ అందించారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం జరిపిన 24 గంటల వ్యవధిలోనే పీఆర్సీపై ప్రకటన చేశారు. నిన్న ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం జగన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలపై నేడు ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమైయ్యారు అనంతరం మరో మారు ఉద్యోగ సంఘాల నేతలను పిలిచి మాట్లాడిన జగన్..23 శాతం ఫిట్ మెంట్ ప్రకటించారు.

Big Breaking ap cm jagan announced employees prc
Big Breaking ap cm jagan announced employees prc

Big Breaking: పదవీ విరమణ వయసు పెంపు

రిటైర్మెంట్ వయసు 60 నుండి 62 సంవత్సరాలకు పెంపు చేస్తున్నట్లు ప్రకటించారు. జనవరి 1 నుండి పెంచిన కొత్త జీతాలు చెల్లించడం జరుగుతుందని తెలిపారు. దీనిపై ప్రభుత్వానికి 10,247 కోట్ల అదనపు భారం పడనుంది. పీఆర్సీ 2028 జూలై 1 నుండి అమలులోకి వస్తుందని తెలిపారు. మానిటరీ బెనిఫిట్ 2020 ఏప్రిల్ 1 నుండి అమలుకు నిర్ణయాన్ని తెలిపారు. ఈ జనవరి నుండి పెంచిన కొత్త వేతనాలు అమలు కానున్నాయి. సీపీఎస్ పై జూన్ 30లోగా నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ జూన్ 30లోగా ప్రొబేషన్ రిక్లేర్ చేసే ప్రక్రియను పూర్తి చేసి సవరించిన రెగ్యులర్ జీతాలను (న్యూపేస్క్ లు) ఈ ఏడాది జూలై జీతం నుండి ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా సొంతిల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న జగనన్న స్మార్ట్ టౌన్ షిప్ లో ఎంఐజీ లే అవుట్స్ లోని ప్లాట్లలో పది శాతం రిజర్వ్ చేయడమే కాకుండా 20 శాతం రాయితీ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More: Somu Veerraju: నచ్చినప్పుడు చంద్రబాబు లవ్ చేస్తాడు.. తర్వాత బ్రేకప్ చెబుతాడు అంటూ సోము సెటైర్లు..!!


Share

Related posts

Jasmine మల్లెలతో ఎప్పుడైనా ఇలా చేశారా??

Kumar

డేంజర్ జోన్ లో రష్మిక మందన్న .. జాగ్రత్తపడకపోతే అంతే ..?

GRK

ఇది ఎప్పటికీ జగన్ మీద చెరిగిపోని ‘బ్యాడ్ రిమార్క్ ‘గా మిగిలిపోనున్నదా?

Yandamuri