న్యూస్

Big Breaking: బిటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు కీలక తీర్పు.. నిందితుడు శశికృష్ణ కు ఉరి శిక్ష..

Share

Big Breaking: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసులో గుంటూరు ప్రత్యేక కోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది. గత ఏడాది ఆగస్టు 15న అని హత్య జరగ్గా ఏడు నెలల వ్యవధిలోనే విచారణ పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడటం విశేషం. నిందితుడు శశికృష్ణకు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఉరి శిక్ష విధించారు. కోర్టు తీర్పు పై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. 

 

బిగ్ బ్రేకింగ్: ఆరు నెలల్లోనే శిక్ష ఖరారు

విషయంలోకి వెళితే… సోషల్ మీడియా ద్వారా పరిచయం అయిన బి టెక్ విద్యార్థిని రమ్య ను కంచాల శశికృష్ణ ప్రేమ పేరుతో వేధించి నడిరోడ్డు పై కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసాడు. ఈ ఘటన పై నాడు రాజకీయ పార్టీ లు ఆందోళన చేసాయి. ఘటన ప్రాంతంలో సీసీ కెమెరా లో నమోదు అయిన హత్య దృశ్యాల ఆధారంగా 24 గంటల వ్యవధిలోనే నరసరావుపేట సమీపంలో నిందితుడు శశి కృష్ణ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో శశికృష్ణ కత్తి తో మెడ కోసుకొని ఆత్మహత్యా యత్నం చేసుకో బోయాడు. వెంటనే నిలువరించిన పోలీసులు స్వల్ప గాయాలతోనే శశికృష్ణ ను అదుపులోకి తీసుకోని ఆసుపత్రి కి తరలించారు. అనంతరం కోర్టులో హాజరు పర్చి న్యాయమూర్తి అదేశాల మేరకు జైలు కు తరలించారు. ప్రస్తుతం శశికృష్ణ జైలు లో ఉన్నాడు. పోలీసులు 36మంది ని విచారించి 15 రోజుల్లోనే ఛార్జ్ షీట్ దాఖలు చేసారు. ఆనాడే సీఎం జగన్ స్పందించి భాదిత కుటుంబానికి రూ.10లక్షల పరిహారాన్ని అందించారు. దర్యాప్తు ను త్వరిత గతిన పూర్తి చేసి నిందితుడికి శిక్ష పడేలా చూడాలని ఆదేశించారు.

 

ఈ క్రమంలో గుంటూరు ప్రత్యేక కోర్టులో డిసెంబర్ లో విచారణ ప్రారంభం అయింది. ప్రత్యేక కోర్టులో పీపీ 28 మంది సాక్షులను విచారించగా.. న్యాయమూర్తి రాంగోపాల్ వద్ద సాక్షులు వాంగ్మూలం ఇచ్చారు. హత్య కేసులో కీలకమైన సీసీ టీవీ వీడియోను పరిశీలించిన న్యాయమూర్తి ఇరువర్గాల వాదనలు విని ఈ నెల 26న కేసు విచారణ ముగిసింది. ఈ కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్ కూడా క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన విషయం తెలిసిందే.


Share

Related posts

YS Jagan – ABN RK: జగన్ దూకుడు.. ఏబీఎన్ ఆర్కే సవాల్..! ఇక డైరెక్ట్ పోరు..!?

Srinivas Manem

ఆడవారు ముఖ్యం గా గర్భిణీలు గాజులు వేసుకుంటే ఏమి జరుగుతుందో తెలిస్తే ఆశ్చర్య పోతారు.

Kumar

నేను హీరో అవుతానంటే అద్దంలో ముఖం చూసుకో అన్నారు? సీనియర్ యాక్టర్ భాను చందర్

Varun G
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar