జాతీయం న్యూస్

Big Breakling: శ్రీలంక ప్రధాని రాజపక్సే రాజీనామా

Share

Big Breakling:  శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక తీవ్రమైన ఆర్ధిక, ఆహార సంక్షోభంలో మునిగిపోయిన సంగతి తెలిసిందే. దేశంలో ఈ పరిస్థితికి దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే, ఆయన సోదరుడు ప్రధాని మహేంద్ర రాజపక్సే కారణం అంటూ ప్రజలు కొన్ని రోజులుగా తీవ్ర ఆందోళనలు చేపడుతున్నారు. రోడ్డుపైకి వచ్చి తీవ్ర తీవ్ర నిరసనలు తెలియజేస్తున్నారు. సైన్యం రంగంలోకి దిగినప్పటికీ లెక్క చేయకుండా ప్రజలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. అధ్యక్షుడు, ప్రధాని నివాసాలపై దాడికి యత్నించారు. ఈ నేపథ్యంలో పలు చోట్ల ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.

Big Breaking sri lanka prime minister mahinda rajapaksa resigns
Big Breaking sri lanka prime minister mahinda rajapaksa resigns

 

Big Breakling: విపక్షాల డెడ్ లైన్ కు ముందే

దేశంలో పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు అధ్యక్షుడు గొటబాయ రాజపక్సే దేశంలో రెండు పర్యాయాలుఎమర్జెన్సీ విధించారు. సైన్యానికి సర్వాధికారాలు ఇచ్చారు. అయినప్పటికీ దేశంలో పరిస్థితులు అదుపులోకి రాలేదు. ఈ నేపథ్యంలో నేడు దేశ రాజధాని కొలంబోలో కర్ఫ్యూ విధించారు. మరో పక్క రాజపక్సే సోదరులు గద్దే దిగడానికి విపక్షాలు వారం రోజులు డెడ్ లైన్ పెట్టాయి. దీంతో గడువుకు ముందే మహింద్ర రాజపక్సే తన పదవికి రాజీనామా చేశారు. శ్రీలంక ప్రజలు చాలా ఆగ్రహంతో ఉన్నారు. భావోద్వేగాలకు ఇది సమయం కాదు. హింస మరింత హింసను ప్రేరేపిస్తుంది. ఆర్ధిక సంక్షోభానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుంది అంటూ రాజీనామాకు ముందు మహింద్ర రాజపక్సే ట్వీట్ చేశారు.


Share

Related posts

షాకింగ్: యువ నాయకుడి చేతికి వైకాపా అధ్యక్ష బాధ్యతలు!

CMR

RUIA Deaths: రూయా ఘటనపై ఎన్‌హెచ్ఆర్‌సీ సీరియస్ ..! వాస్తవ లెక్కలు బయటకు వచ్చేనా..?

somaraju sharma

వకీల్ సాబ్ టీజర్ రెడీ..ఫ్యాన్స్ బీ రెడీ ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar