న్యూస్ రాజ‌కీయాలు

జనాలను పీక్కుతింటున్న లోన్ యాప్స్ వెనుక భారీ కుట్ర..? ఛైనా నా… ఉగ్రవాదులా అన్న అనుమానం

Share

గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా లోన్ యాప్స్ సృష్టిస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. ఈ యాప్ ద్వారా వేల కోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఇవన్నీ అక్రమంగా కొనసాగుతున్నట్లు దర్యాప్తులో తేలింది. ఇక వీటి వల్ల జరిగిన కుంభకోణం వల్ల చైనాకు చెందిన నిర్వాహకులు భారీగా లాభపడ్డారు. దీనిపై కేంద్ర ప్రభుత్వాలు దర్యాప్తు చేయడానికి సిద్ధం అయ్యాయి.

 

ప్రజల నుండి అన్యాయంగా వసూలు చేసిన డబ్బు హవాలా రూపంలో వివిధ దేశాలకు తరలిపోయినట్లు సమాచారం. అంతేకాకుండా వీరికి డబ్బులు కట్టలేక… అధిక వడ్డీని భరించలేక చాలామంది మనోవేదనకు గురి అయ్యారు. కొంత మంది ఆత్మహత్య కూడా చేసుకున్నారు. దీంతో కేంద్ర బృందాలు ఎలాగైనా వీటి నిగ్గు తేల్చాలని రంగంలోకి దిగాయి. ఇప్పటికే స్కామ్ ఆఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణ చేపట్టింది.

తాజాగా దేశంలోనే అత్యున్నత నిఘా సంస్థ ‘రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్’ (రా) – RAW దీనిపై దృష్టి పెట్టినట్లు సమాచారం. తాజాగా ‘రా’ అధికారులు హైదరాబాద్కు చెందిన సైబర్ క్రైం పోలీసులను కలిశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన వారికి సంబంధించిన వివరాలు తీసుకున్నారు. ఈ లోన్ యాప్స్ ద్వారా 25 వేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలు జరిగాయి.

చైనీయులు డైరెక్టర్లు గా ఉండి నాలుగు కంపెనీల పేర్లతో ఎన్నో వందల యాప్స్ ద్వారా ప్రజల నుండి డబ్బు లూటీ చేశారు. డిజిటల్ రూపంలో ఉన్న నగదును ఇప్పటికే దారి మళ్లించారు. అది ఏ దేశాల కి వెళ్ళింది? ఎలా వెళ్ళింది? దీని వెనుక ఏదైనా ఉగ్రవాద సంస్థ హస్తం ఉందా అన్న విచారణలు జరుగుతున్నాయి.


Share

Related posts

ఒక్కసారి కమిట్ అయితే పూరి తన మాట తానే వినడు, ఎగ్జాంపుల్ ఇదే..!!

sekhar

తిరుపతి ఉప ఎన్నిక విషయంలో గందరగోళంలో బీజేపీ- జనసేన..??

sekhar

ఎన్.టి.ఆర్ – ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ విషయంలో భారీ షాకిచ్చారుగా ..?

GRK
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar