NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ ప్ర‌పంచం బిగ్ స్టోరీ

10 Babies: ఒకే కాన్పులో 10మంది పిల్లలు.. ప్రపంచాన్నే నమ్మించిన అబద్ధం..!

big lie about 10 babies born

10 Babies: 10మంది కవలలు  10 Babies దక్షిణాఫ్రికాకు చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో 10మంది పిల్లలకు జన్మనిచ్చిందనే వార్త ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిన విషయం తెలిసిందే. ఇదొక రికార్డని 37ఏళ్ల గొసియామె థమారా సిథోలే ఈ అరుదైన రికార్డు సృష్టించినట్టు ప్రపంచ మీడియా బాగా ఫోకస్ చేసింది. అయితే.. జూన్ 7న జరిగిన ఈ డెలివరీపై 15 రోజుల తర్వాత ఓ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది దక్షిణాఫ్రికా ప్రభుత్వం. ఇదంతా అబద్ధమని సిథోలే అసలు గర్భమే దాల్చలేదని భారీ ట్విస్టే ఇచ్చింది. సిథోలే, ఆమె భర్త అబద్ధం చెప్పారని తెలిపింది. ఆమెను పరీక్షించిన వైద్యుల నివేదికను టెంబిసా అధికారులు పూర్తిగా పరిశీలించిన తర్వాతే మీడియాకు ఈ వివరాలు వెల్లడించారు.

big lie about 10 babies born
big lie about 10 babies born

గత నెలలో మొరాకోలో హాలిమా సిస్సే అనే మహిళ 9మంది పిల్లలకు జన్మనిచ్చిన రికార్డును సిథోలే 10మంది పిల్లలకు జన్మనిచ్చి రికార్డు బ్రేక్ చేసిందని.. కాన్పులో ఏడుగురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు జన్మించారని ఆమె భర్త తెబోగో సోతెత్సీ చెప్పడం విశేషం. స్కానింగ్ లో మొదట 6, తర్వాత 8.. కాన్పు సమయంలో 10మంది జన్మించారని తెలిపాడు. అయితే.. దీనిపై దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఎంక్వైరీ చేసింది. దీనిపై ఆధారాలు చూపాలని ఒత్తిడి చేయడంతో సిథోలే పారిపోయింది. దీంతో ఆమె బంధువులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. 17న జోహన్స్ బర్గ్ లోని బంధువుల నివాసంలో సిథోలేను పోలీసులు అదుపులోకి తీసుకుని.. సామాజిక కార్యకర్తల సాయంతో తెంబ్సియా ఆస్పత్రి సైకియాట్రిక్ విభాగంలో చేర్చారు. దీంతో ఆమె అసలు విషయం చెప్పుకొచ్చింది.

Read More: Fevicol: ‘ఫెవికాల్’ క్రియేటివిటీ..! కోకాకోలా దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకుంది..!

ఇంతమంది సంతానం పుట్టారని చెప్పి ప్రజ‌ల నుంచి విరాళాలు సేకరించి మిలియ‌నీర్ కావాల‌నే త‌న భ‌ర్త ఆలోచన ప్రకారమే ఇలా చేసామని చెప్పడంతో పోలీసులు షాక్ తిన్నారు. పైగా.. పది మంది శిశువులు పుట్టినట్లు ఎక్కడా ఆధారాలు లేవని దక్షిణాఫ్రికా ఆరోగ్య శాఖ ప్రకటించడంతో ఈవార్త వైరల్ అయింది. ప్రస్తుతం ఆమెను.. మెంటల్‌ హెల్త్ యాక్ట్‌ కింద అదుపులోకి తీసుకుని ఆమె మానసిక స్థితిపై ట్రీట్‌మెంట్‌ ఇప్పిస్తున్నట్లు తెలిపారు. ప్రిటోరియా న్యూస్ ఎడిటర్ అత్యుత్సాహమే ఈ వార్తకు కారణమని తెలిపింది. గతంతో వారికి ముగ్గురు కవలలు పుట్టారనే వార్త అబద్ధమని తేలడం మరో ట్విస్టు.

 

author avatar
Muraliak

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N