NewsOrbit
న్యూస్

Apple: యాపిల్ యూజర్లకు పెద్ద గుడ్ న్యూస్

Apple: వరల్డ్ వైడ్‌గా యాపిల్ బ్రాండ్ ఉత్పత్తులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అందుకే ఈ బ్రాండ్ కు సంబంధించిన ఐఫోన్స్, మ్యాక్స్ కంపూటర్స్ ఎక్కువగా సేల్ అవుతుంటాయి. ఇక ఈ కంపెనీ నుంచి కొత్త మోడల్ రిలీజ్ అయిందంటే ఆ టైంలో మామూలు సందడి ఉండదనే చెప్పాలి. ఆ కొత్త మోడల్స్ ను దక్కించుకునేందుకు చాలా మంది టెక్ లవర్స్ ఉత్సుకత చూపిస్తుంటారు. అయితే యాపిల్ ప్రొడక్స్ రిపేర్ వస్తే ఇక పెద్ద ప్రాబ్లమే అని చెప్పక తప్పదు. ఎందుకంటే వాటిని తప్పనిసరిగా యాపిల్ సర్వీస్ సెంటర్స్‌లోనే రిపేర్ చేయించుకోవాల్సిన పరిస్థితి. ఇక ఇలాంటి ప్రాబ్లమ్స్‌కు సొల్యూషన్ తీసుకొచ్చింది యాపిల్ కంపెనీ. తొందర్లోనే సెల్ఫ్ సర్వీస్ రిపేర్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్టు అనౌన్స్ చేసింది.

స్వయంగా రిపేర్..

అయితే ఐఫోన్స్, మ్యాక్ ల్యాప్‌టాప్స్‌కు సంబంధించిన స్పేర్‌పార్ట్స్, టూల్స్‌ను ఇక నుంచి కామన్ ప్రజలకు సైతం విక్రయించనున్నట్టు యాపిల్ కంపెనీ వెల్లడించింది. వీటితో వచ్చే మాన్యువల్స్‌ను అనుసరించి ప్రజలే స్వయంగా రిపేర్ చేసుకోవచ్చని తెలిపింది. లేదంటే వాటిని ఉపయోగించి బయటి షాపుల్లోనూ రిపేర్స్ చేయించుకోవచ్చు. ఇలా స్పేర్‌పార్ట్స్‌ను సేల్ చేసేందుకు యాపిల్ కంపెనీ సిద్ధమవడం హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం.

అందుబాటులోకి 200 స్పేర్ పార్ట్స్..

తన కస్టమర్స్ వినియోగ నిమిత్తం సుమారు 200 స్పేర్‌పార్ట్స్, టూల్స్‌ను అందుబాటులోనికి తీసుకురాబోతున్నట్టు కంపెనీ ప్రకటించింది. ఐఫోన్-12, ఐఫోన్-13కు సంబంధించి బ్యాటరీలు, డిస్ ప్లేలు, కెమెరాల వంటివి సైతం అందుబాటులోనికి తీసుకువస్తున్నట్టు తెలిపింది. తొందరలోనే మాక్స్ కంప్యూటర్స్‌కు సంబంధించిన సెల్ఫ్ సర్వీస్ ప్రోగ్రాంను తీసుకురానుంది. అయితే ఇతర రిపేర్‌షాప్స్ స్పేర్‌పార్ట్స్, టూల్స్ కొనేందుకు ఇప్పటికే కార్యక్రమాన్ని యాపిల్ కంపెనీ ప్రారంభించింది. టోటల్‌గా 2,800 ఇండిపెండెంట్ షాప్‌లు ఈ ప్రోగ్రామ్స్‌లో ఉండనున్నాయి. కస్టమర్స్ తాము యూజ్ చేసిన స్పేర్‌పార్ట్స్‌ను ఇండిపెండెంట్ దుకాణాల్లో ఇస్తే.. వాటి ప్లేస్‌లో కొత్త వాటికి డిస్కౌంట్స్ సైతం యాపిల్ ఇవ్వనుంది. సెల్ఫ్‌సర్వీస్ ప్రోగ్రామ్ వచ్చే ఏడాది ప్రారంభంలో ప్రారంభమవుతుందని ప్రకటించింది యాపిల్.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

BSV Newsorbit Politics Desk