రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘స్టార్ మా’ లో ప్రసారం అయ్యే కార్తీకదీపం సీరియల్ ఎంత ఫేమస్ అన్నది అందరికీ తెలుసు. అప్పుడెప్పుడో వచ్చిన చక్రవాకం, మొగలిరేకులు లాంటి సీరియల్స్ తర్వాత ఇప్పుడు కార్తీకదీపం అతి భారీ రేటింగ్ సాధిస్తూ పూర్తిగా ఫేమస్ అయిపోయింది. ఇక ఈ సీరియల్ లో హీరోయిన్ గా నటిస్తున్న ప్రేమి విశ్వనాథ్ కూడా ఎక్కడ లేని క్రేజ్ వచ్చేసింది. ఇదే వరసలో తాజాగా ఆమె ఒక అరుదైన రికార్డు సాధించింది.
మలయాళంలో 2014లో ప్రసారమైన సూపర్ హిట్ ధారావాహిక ‘కురుతముత్తు’ కు ఇది రీమేక్ అన్న విషయం తెలిసిందే. ఇందులో హీరో అయినా డాక్టర్ బాబు… దీప అలియాస్ వంటలక్క ను పెళ్లి చేసుకుని అనుమానంతో వదిలేస్తాడు. ఆ తర్వాత ఆమెకు పుట్టిన కవల పిల్లలు తల్లిదండ్రులను ఎలా కలిపారు అన్నది మిగిలిన కథ.
దాదాపు రెండున్నర ఏళ్ళుగా ఏ సీరియల్ కు సాధ్యపడని రేటింగ్స్ సాధిస్తూ ఈ సీరియల్ తన సత్తా నిరూపించుకుంటుంది. ఇప్పుడు తాజాగా ప్రేమి విశ్వనాథ్ ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దేశవ్యాప్తంగా బుల్లితెరపై ఉత్తమ నటీనటులను ఎంపిక చేసే ఆర్ మాక్స్ మీడియా తాజాగా 2020 సంవత్సరానికి సంబంధించిన జాబితాను విడుదల చేసింది.
ఇందులో తెలుగు నుండి ప్రేమి విశ్వనాథ్ ఉత్తమ కల్పిత పాత్ర విభాగంలో ఉత్తమ నటిగా ఎంపికయింది. అలాగే హిందీ లో జెతాలాల్, తమిళంలో ముల్లాయి, బెంగాలీ లో శ్రీ మోయా, మరాఠీ లో అరుంధతీ ఈ క్యాటగరీలో ఎంపికయ్యారు.