రానా దగ్గుబాటి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా విరాటపర్వం. నీది నాది ఒకే కథ సినిమాని తెరకెక్కించి టాలీవుడ్ దృష్టిని ఆకర్షించిన వేణు ఉడుగుల ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. సాయిపల్లవి, ప్రియమణి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అంతేకాదు ఈ ఇద్దరు ఈ సినిమాలో నక్సలైట్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన టైటిల్ పోస్టర్ అలాగే సాయి పల్లవు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన సాయి పల్లవి పాత్ర లుక్ తో విరాటపర్వం మీద పాజిటివ్ బజ్ క్రియోటయింది.
ఇక ఈరోజు ఈ సినిమాలో నటిస్తున్న మరో హీరోయిన్ ప్రియమణి బర్త్ డే సందర్భంగా తన లుక్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. నక్సల్స్ ఎలా ఉంటారో ప్రేక్షకులకు క్లారిటి ఇస్తూ రిలీజ్ చేసిన ప్రియమణి పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ బర్త్ డే గిఫ్ట్ స్వీట్ షాకింగాను ఉంది. ముందెన్నడు కనిపించనంత వినూత్నంగా ప్రియమణి ఈ తాజా చిత్రంలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అయితే తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ద్వారా ప్రియమణి పాత్ర రియల్ లైఫ్ మహిళా నక్సలైట్ సీతక్క పాత్రకి స్ఫూర్తి అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దళకమాండర్ గా సీతక్క ఒకప్పుడు ఎంతటి సంచలనం సృష్ఠించిందో అందరికి తెలిసిందే. ఆ పాత్రనే ఇన్స్పిరేషన్ గా తీసుకొని దర్శకుడు ప్రియమణి పాత్రను డిజైన్ చేశారట. ఇక ఈ సినిమాని డి సురేష్ బాబుతో, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. దాదాపు సగ భాగం ఈ సినిమా టాకీ పార్ట్ ని కంప్లీట్ చేసుకుందట. లాక్ డౌన్ తర్వాత తిరిగి షూటింగ్ మొదలవనుందని తాజా సమాచారం.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!