NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ

మోదీ స్కెచ్ మాములుగా ఉండదు మరీ!!

 

 

రాజకీయాల్లో తెలివితేటలు ఒక ఇంచు ఎక్కువే ఉండాలి… లేకపోతే సాధారణ మనుషులకు, రాజకీయ మేధావులకు ఎక్కడ తేడా ఉంటుంది..?? మోదీ లాంటి అపర మేధావి కి, రాజకీయాల్లో తలపండిన గడ్డం కూడా పండిన అపర ఋషికి ఈ రాజకీయ తెలివితేటలకు కొదవేం ఉంటుంది.. అందుకే ఇప్పుడు మోడీ వేసిన అతి పెద్ద ఎత్తు మొత్తం భారతదేశంలోనే చర్చకు దారి తీసింది. వ్యవసాయాధారిత దేశంగా ఉన్న భారతదేశంలో లక్షలాది మంది రైతులు రోడ్డుమీదకు వచ్చి 15 రోజులుగా నిరసనలు చేస్తున్న పట్టించుకోలేదన్న నల్లమార్కు చెరుపుకునేందుకు తెల్లని గడ్డం పెంచుకున్న ఢిల్లీ అధిపతి కొత్త ప్రణాళిక వేశారు… ఇది ఎంతటి ఆసక్తికరమైనది అంటే… కర్ర విరగకూడదు పాము చావాలి అన్న అతిపెద్ద ఎత్తు.

** ఢిల్లీలో జరుగుతున్న రైతు ఉద్యమం పట్ల మోడీ సర్కార్ సరిగా స్పందించడం లేదన్న అపవాదును తొలగించుకునేందుకు ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు.
** ప్రధాని హోదాలో ఉన్న ఆయన రైతులకు శిరసు వంచి చేతులెత్తి నమస్కరించాలి చర్చకు రావాలని ఆహ్వానించడం ఇప్పుడు సరికొత్త బిజెపి ఎత్తుకు నిదర్శనమని రాజకీయ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటివరకు పలుమార్లు సమావేశమైన కేంద్ర క్యాబినెట్… రైతుల ఉద్యమంపై పలుమార్లు చర్చించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ సైతం చర్చలకు రావాలని రైతులను కోరగా వారు తమ వద్దకు మంత్రులు రావాలని పేచీ పెట్టారు. దీని తర్వాత బీజేపీ సోషల్ మీడియా విభాగం సైతం రైతుల ఉద్యమంపై పలు పుకార్లు ప్రచారాలు బయటకు తీసుకు వచ్చింది. దీంతో దేశ వ్యాప్తంగా రైతుల ఉద్యమం పట్ల బిజెపి వ్యవహరిస్తున్న తీరు సరిగా లేదని విమర్శలు వెల్లువెత్తడంతో దాన్ని ఎలాగైనా తోసిపుచ్చి బయటపడేందుకు బీజేపీ ఇప్పుడు కొత్తగా ప్రయత్నిస్తోంది.
** బిజెపి నాయకులు రైతుల వద్దకు వచ్చి రైతుల సమక్షంలోనే చర్చించి వారికి సరైన దారి చూపించడమో లేక ఒక ప్రత్యేకమైన హామీ ఇవ్వడం చేస్తే తప్పేంటని తటస్థం లు మేధావులు కోరారు.
** ప్రజాస్వామ్య దేశంలో ఎప్పుడూ తటస్థ మేధావులు మాట ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది. తటస్థ ఓట్లు రాజకీయాల్లో ఎక్కువ ప్రాధాన్యం ఉంటాయి. ఇప్పుడు ఈ వర్గాల నుంచే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాటలు రావడం తో వెంటనే దీన్ని చక్కదిద్దే ప్రయత్నాన్ని మోదీ తీసుకున్నట్లు కనిపిస్తోంది.
** మోడీ స్వయంగా రంగంలోకి దిగి రైతులకు చేతులెత్తి శిరస్సు వంచి నమస్కరించి చర్చలకు ఆహ్వానించడం భారతదేశ చరిత్రలో ఇదే ప్రథమం. ఇంతటి కీలకమైన కోరిక కోరిన ప్రధాని మాటలు సైతం ఇప్పుడు రైతులు మన్నించక పోతే అది రైతులు తప్పు అయ్యేలా చూపడమే మోదీ ప్రధాన ఉద్దేశం. అంటే ఓ ప్రధాని స్థాయిలోని వ్యక్తి చేతులెత్తి నమస్కరించిన చర్చలకు రావాలని ఆహ్వానించిన రైతులు రైతు సంఘాలు దానికి సరిగా స్పందించకపోతే అది వారి తప్పే అవుతుంది. దీనికి అన్ని వైపులా మోదీకి మద్దతు లభిస్తుంది.
** అంటే ఓ ప్రణాళిక ప్రకారం ప్రధాని హోదాలో మోడీ బాలు రైతుల కోర్టులోకి నెట్టేసి… రైతు సంఘాల నాయకులను ఇరుకున పెట్టే ప్రయత్నం అన్నమాట. రైతు సంఘాల నాయకులు లో కొంత స్పష్టత కొన్ని భిన్నమైన వాదనలు దీని పై నడుస్తున్న తరుణంలో మోదీ మాతను ఆయన విన్నపాన్ని ఎలా పట్టించుకోవాలి అనేదానిమీద రైతు సంఘాల నాయకులు మల్లగుల్లాలు పడుతున్నారు. మోదీ వేసిన స్కెచ్ ఇప్పుడు రైతు ఉద్యమంలో కీలకంగా మారింది.

author avatar
Comrade CHE

Related posts

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju