NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

Chandrababu : బాబు కు దెబ్బ మీద దెబ్బ! అబ్బో పెద్ద స్కెచ్!!

Chandrababu :  జల్సా సినిమాలో ఒక కీలకమైన డైలాగ్ ఉంటుంది.. శత్రువుని ఓడించడం అంటే చంపడం కాదు.. కేవలం ఓటమి రుచి చూపడమే అని… అంటే శత్రువుని చంపేసి అక్కడితో చేతులు దులుపేసుకుంటే పెద్ద విషయం కాదు.అతన్ని బతికున్నంతకాలం ఇబ్బంది పెట్టే లా గెలుపు ఉండాలన్నది అసలు విషయం. ఇప్పటికే పీకల్లోతు కష్టాల్లో కనిపిస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ ఆత్మ ధైర్యాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు Chandrababu నాయుడు మనోధైర్యాన్ని దెబ్బకొట్టేందుకు అధికార పార్టీ సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం టీడీపీ కు కోలుకొని దెబ్బ కొట్టిన వైస్సార్సీపీ నాయకులు, ade పద్ధతి లో చంద్రబాబు సొంత ఊరు నారావారిపల్లెలో సైతం ఆయనకు జెర్క్ ఇచ్చి నోరేట్టకుండా చేయాలనీ భావిస్తున్నారు. నారావారిపల్లెలో చంద్రబాబు ను ఓడిస్తే ఆయన ఇంకెప్పుడు ఇతరుల మీద విమర్శ చేసిన, సొంత ఊరి ఓటమిని ఆయనకు గుర్తు చేసినట్లు అవుతుంది అన్నది వైస్సార్సీపీ నేతల భావన. కుప్పం కంటే నారావారిపల్లె విజయాన్ని వైఎస్సార్సీపీ నేతలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది . కుప్పంలో ఇప్పటికే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో వైసీపీ జెండా నిలబెట్టిన స్పూర్తితో మరో కీలక అడుగు పడుతోంది.

big-skecth-for-chandrababu-own-village
big skecth for chandrababu own village

ఆదివారం భవితవ్యం తేలనుంది

చిత్తూరు జిల్లా, చంద్రగిరి నియోజకవర్గంలోని చిన్నగొట్టిగల్లు మండలం , నారావారిపల్లె చంద్రబాబు పుట్టిన ఊరు. ఇది చంద్రగిరి నియోజకవర్గంలోని కందుల వారి పల్లె పంచాయతీ లో ఉంది. ఇక్కడ జనాభా1328. వీరిలో పురుషులు 670 మంది అయితే, మహిళా జనాభా 659. మొత్తం 330 కుటుంబాలు ఇక్కడ నివసిస్తుంటాయి. వ్యవసాయాధారిత గ్రామం. మొత్తం ఆరు వార్డులు ఉన్నాయి. అలాగే గ్రామం మొత్తం మీద రెండు వందల హెక్టార్ల భూమి ఉన్న రైతులు ఉన్నారు. నియోజకవర్గ ముఖ్య కేంద్రం చంద్రగిరికి కేవలం 4 కిలోమీటర్ల దూరంలో చంద్రబాబు స్వగ్రామం ఉంటుంది.

కందుల వారి పల్లి పంచాయతీ లోకి వచ్చే ఈ గ్రామము ప్రస్తుతం నాలుగో దశలో ఆదివారం ఎన్నికల సంగ్రామం లో ఉంది. కందుల వారి పల్లె పంచాయతీ ఈసారి జనరల్ మహిళ కు రిజర్వు అయింది. దింతో టీడీపీ, వైస్సార్సీపీ లు కొత్త ఎత్తులతో ఇప్పటికే అభ్యర్థులను రంగంలోకి దింపి ప్రచారం సైతం ముమ్మరంగా చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఈ పంచాయతీ నుంచి 30 శాతం మేర వైఎస్ఆర్సిపి కు ఓట్లు లభించాయి. అలాగే గతంలో సైతం, ఎంపిటిసి లుగా, సర్పంచులు ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు ఇక్కడ పని చేశారు. దీంతో ఈసారి ఈ పంచాయతీ ను ఎట్టి పరిస్థితిలో గెలుచుకునేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే కుప్పంలో టిడిపిని మట్టికరిపించిన ఉత్సాహంతో చంద్రబాబు సొంత గ్రామంలో కూడా పాగా వేస్తే, అది ఆయన ప్రతిష్ట ను దెబ్బ తీస్తుందని, నైతికంగా బాబు మీద పైచేయి సాధించవచ్చన్నది వైసీపీ నేతల మాట.

చెవిరెడ్డి వ్యూహం!

నారావారి పల్లె గ్రామంలో దాదాపు మెజారిటీ ఓట్లు సాధించేందుకు చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకమైన దృష్టి పెట్టారు . కందుల వారి పల్లి పంచాయతీ ఈసారి ఓసి మహిళలకు రిజర్వు అయినప్పటికీ అధికార పార్టీ వైఎస్సార్సీపీ తరఫున ఎస్సీ మహిళను నిలబెట్టారు. టీడీపీ మాత్రం అగ్రకులానికి ప్రాధాన్యం ఇచ్చింది. ఇది ఒక వ్యూహాత్మక ఎత్తుగడ అని చెప్పవచ్చు. పంచాయితీ మొత్తంమీద 40% పైగా దళితుల ఓట్లు ఉంటాయి. అలాగే నారావారిపల్లెలో సైతం 30 శాతం పైగానే వీరు ఓట్లు కనిపిస్తాయి. ఎప్పుడూ అగ్రకులాల కే ప్రాధాన్యం నేతలు ఈసారి వ్యూహాత్మకంగా రూటు మార్చారు.

అభ్యర్థి విషయంలోనే కీలక అడుగు వేసినా వైస్సార్సీపీ నేతలు, ఆమె గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ప్రతి వార్డు ను సమన్వయం చేసేందుకు నియోజకవర్గస్థాయి నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రతి ఓటర్ ను కలిసి ప్రభుత్వ సంక్షేమాన్ని వివరిస్తూ వైయస్సార్సీపి మద్దతుదారులకు ఓటు అభ్యర్ధిస్తున్నారు.

కుప్పం స్ఫూర్తితో ముందుకు…

కుప్పంలో అద్భుతమైన విజయం సాధించిన అధికార పార్టీ చంద్రబాబు స్వగ్రామంలో కూడా జెండా ఎగురవేయాలని గట్టిగా భావిస్తోంది. దీనికోసం చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల దగ్గరనుంచే నారావారిపల్లె ఓటర్లను ప్రత్యేకంగా కలిసేందుకు, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు వాక్యము చేసేందుకు ప్రత్యేకమైన ఒక బృందాన్ని ఏర్పాటు చేసారు. ప్రతి ఇంటికి వెళ్లి వారికి అందుతున్న పథకాలు, రాజకీయాలకు అతీతంగా వారికి ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరిస్తూనే ఓట్లు అడుగుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన అనుచరగణంతో నారావారిపల్లి పైనే దృష్టి పెట్టేలా చూస్తున్నారు. నియోజకవర్గంలోని మిగతా పంచాయితీలు ఒక ఎత్తు అయితే నారావారి పల్లె గ్రామం ఉన్న కందుల వారి పల్లి పంచాయతీ గెలుపు ఎవరికి ఇప్పుడు ఒక ఎత్తుగా కనిపిస్తోంది.

దీంతో పాటు ఈసారి జగన్ మంత్రివర్గంలో స్థానం ఆశిస్తున్న చెవిరెడ్డి కి ఇప్పుడు కందుల వారి వారి పల్లె గెలుపు అత్యవసరం. జగన్ కు ఈ విషయాన్నీ గట్టిగా చెప్పుకోవడానికి చివరికి ఓ అవకాశం దొరుకుతుంది. ఈ గ్రామంలో సుమారు 30 మేర దళితులు ఉంటారు. వారికీ తగిన ప్రాధాన్యం ఎప్పుడు చంద్రబాబు ఇచ్చింది లేదు. ఇప్పుడు ఏకంగా పంచాయతీ సర్పంచ్ గా దళిత మహిళను నిలబెట్టడం తో వారు ఎంతో ఆనందంగా కనిపిస్తున్నారు. ఎప్పటి నుంచో తాము కేవలం ఓట్లు వేసే వారీగా మిగిలిపోయామని, ఈ సారి తమ వర్గం నుంచి కచ్చితంగా పంచాయితీ సర్పంచ్ గెలిపించుకుంటామన్న మోసాలు వైఎస్ఆర్సిపి పార్టీ నేతలు వారి అందిస్తున్నారు. ఇప్పటికే నారావారిపల్లి లో రాజకీయ సందడి తారా స్థాయిలో కనిపిస్తోంది. ఇప్పుడు జిల్లా చూపంతా నారావారిపల్లె గ్రామం ఉన్న కందుల వారి పల్లి పంచాయతీ పైనే పడింది. పరువు నిలుపుకునేందుకు టిడిపి నేతలు తంటాలు పడుతుంటే, ఖచ్చితంగా దాన్ని విజయం సాధించి జగన్ కు బహుమతిగా ఇవ్వాలని వైఎస్సార్ సీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు.

 

author avatar
Comrade CHE

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju