NewsOrbit
న్యూస్ సినిమా

మెగా ఫ్యాన్స్ కి భారీ సర్‌ప్రైజ్.. రాం చరణ్ – పూరి కాంబోలో సినిమా ఫిక్స్..?

మెగా పవర్ స్టార్ రాం చరణ్ ని సిల్వర్ స్క్రీన్ కి హీరోగా పరిచయం చేసింది డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్. పక్కా కమర్షియల్ హీరోగా లాంచ్ అయిన చరణ్ మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. మెగాస్టార్.. పూరి మీద నమ్మకం పెట్టుకొని చరణ్ ని హీరోగా నిలబెట్టే బాధ్యతని అప్పగించినందుకు మంచి హిట్ ఇచ్చి మెగాస్టార్ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు పూరి. ఆ తర్వాత మళ్ళీ ఎన్నో సార్లు పూరి జగన్నాధ్ – రాం చరణ్ ల కాంబినేషన్ లో సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికి ఎందుకనో ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు.

Ram Charan, Alia Bhatt, Ajay Devgn starrer RRR to be postponed to the summer of 2021? | Celebrities News – India TV

ఇక ఈ సినిమా తర్వాత రాం చరణ్.. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మగధీర సినిమా చేశాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మించిన ఈ సినిమా భారీ హిట్ ని సొంతం చేసుకుంది. అంతేకాదు ఇండస్ట్రీ హిట్ అందుకున్న సినిమాగా రికార్డ్ క్రియోట్ చేసింది. కాగా ప్రస్తుతం రాం చరణ్ – ఎన్.టి.ఆర్ కాంబినేషన్ లో భారీ మల్టీస్టారర్ గా ఆర్ ఆర్ ఆర్ తెరకెక్కుతోంది. డీవీవీ దానయ్య దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా రాం చరణ్ నటిస్తుండగా కొమరం భీం గా ఎన్.టి.ఆర్ నటిస్తున్నాడు.

కాగా ఫిబ్రవరి లేదా మార్చ్ వరకు ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కంప్లీట్ అవుతుందని అంటున్నారు. ఈ క్రమంలో ఎన్.టి.ఆర్ తన నెక్స్ట్ సినిమాని మాటల మాంత్రీకుడు త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. అలాగే మరికొన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టుకున్నాడు. కాని చరణ్ మాత్రం ఆర్ ఆర్ ఆర్ తర్వాత ఏ దర్శకుడితో సినిమా చేయబోతున్నాడో క్లారిటీ లేదు. అయితే కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య లో మాత్రం కీలక పాత్ర పోషిస్తున్నాడు.

కాగా తాజా సమాచారం ప్రకారం చరణ్ తన నెక్స్ట్ సినిమాని పూరి జగన్నాధ్ తో చేస్తాడన్న మాట వినిపిస్తోంది. ప్రస్తుతం పూరి జగన్నధ్.. విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అన్న వర్కింగ్ టైటిల్ తో ఒక పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీటయ్యాక చరణ్ తో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమా యూనివర్సల్ పాయింట్ తో పాన్ ఇండియన్ రేంజ్ లో ఉండబోతోందని సమాచారం. చూడాలి మరి ఈ సినిమా కి సంబధించిన అఫీషియల్ న్యూస్ ఎప్పుడు వస్తుందో.

Related posts

Masthu Shades Unnai Ra OTT Release: ఓటిటిలో సందడి చేయనున్న అభినవ్ గోమటం కామెడీ మూవీ.. కడుపుబ్బ నవ్వేందుకు మీరు రెడీనా..?

Saranya Koduri

Sundaram Master OTT: కడుపుబ్బ నవ్వించేందుకు ఓటీటీలోకి వచ్చేస్తున్న సుందరం మాస్టర్.. ఈ కామెడీ మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

Guppedanta Manasu March 28 2024 Episode 1036: అనుపమ మను తో కలిసి భోజనం చేస్తుందా లేదా.

siddhu

Madhuranagarilo March 28 2024 Episode 324: రాధా రక్తం అమ్ముకొని పండు కి బొమ్మ కొనిచ్చిందని బాధపడుతున్న శ్యామ్..

siddhu

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Saranya Koduri

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

Krishna Mukunda Murari March 28 2024 Episode 430: మీరా మీద కృష్ణ కి డౌట్..కృష్ణ ని లిమిట్స్ లో ఉండమన్న మురారి.. ఆదర్శ మనసు మార్చాలీ అనుకున్న మీరా..

bharani jella

Trinayani March 28 2024 Episode 1200: శివ జ్యోతి మీద ప్రమాణం చేసి ఆపద కొని తెచ్చుకున్న పెద్ద బొటమ్మ..

siddhu

Brahmamudi March 28 2024 Episode 369: అపర్ణ ని మాటల తో ఇబ్బంది పెట్టిన రుద్రాణి..కావ్య కి సపోర్ట్ గా స్వప్న.. కోటి రూపాయల నష్టం?

bharani jella

Nuvvu Nenu Prema March 28 2024 Episode 583: పద్మావతి నుండి విక్కీ దూరం కానున్నాడా? పద్మావతి తెలివికి ఆశ్చర్యపోయిన కృష్ణ.. ఆస్తి పేపర్లు సేఫ్..

bharani jella

Tillu Square: సిద్దు జొన్నలగడ్డ కొత్త సినిమా “టిల్లు స్క్వేర్” ట్రైలర్ రిలీజ్..!!

sekhar

Ram Charan: రామ్ చరణ్ బర్త్ డే సెలబ్రేషన్స్ లో “RC16” గురించి డైరెక్టర్ బుచ్చిబాబు కీలక వ్యాఖ్యలు..!!

sekhar

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju