NewsOrbit
న్యూస్

బిగ్ ట్విస్ట్ : హైకోర్టు చెప్పింది సరే… నిమ్మగడ్డను గవర్నర్ నియమించాలి కదా!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ పునఃనియామకం కోసం హైకోర్టు దిశానిర్దేశం తో ఆయన గవర్నర్ ను కలవనున్నారు. 20వ తేదీన రాజ్ భవన్ నిమ్మగడ్డకు అపాయింట్ మెంట్ ఇచ్చింది.

 

 

హైకోర్టు ఆదేశాలను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నిమ్మగడ్డ గతంలోనే గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అయితే అప్పుడు గవర్నర్ కార్యాలయం నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఇప్పుడు నేరుగా హైకోర్టు ఆదేశించడంతో గవర్నర్ నుంది నిమ్మగడ్డకు అపాయింట్మెంట్ వచ్చింది. హైకోర్టు తీర్పును వివరించి తన బాధ్యతలు తీసుకోవాలని…. ఈ విషయంలో సహకరించాలని నిమ్మగడ్డ గవర్నర్ ను కోరనున్నాడు.

అయితే గతంలో రమేష్ కుమార్ విషయంలో ప్రభుత్వానికి గవర్నర్ అండగా నిలిచారు. మొదట నిమ్మగడ్డ నియామకం గవర్నర్ చేతుల మీదుగానే జరుగుతుంది. ఎస్ఈసి పదవి రాజ్యాంగబద్ధమైనది అని కూడా ఆయనకి తెలుసు. అసలు మ్యాటర్ ఏమిటంటే.. ప్రభుత్వాలు సిఫారసు చేసినా గవర్నర్ దానిని కచ్చితంగా దానిని ఆమోదించాలి అన్న నిబంధన అయితే ఏమీ లేదు. చంద్రబాబు హయాంలో ఇతర అధికారిని సిఫార్సు చేసినప్పటికీ అప్పటి గవర్నర్ నరసింహన్ తన వద్ద చాలా కాలం పని చేసిన నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల కమిషనర్ గా నియమించారు.

అయితే కొద్ది రోజుల కిందట మాత్రం నిమ్మగడ్డను తొలగించబడిన ఉత్తర్వుల మీద సంతకం చేసిన విశ్వభూషణ్ హరి చందన్… కనగరాజ్ ను కొత్త ఎస్ఈసీగా నియమిస్తూ జారీ చేసిన ఉత్తర్వులు పైనా సంతకం పెట్టారు. కాబట్టి ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న గవర్నర్ వద్దకే ఇప్పుడు నిమ్మగడ్డ వెళ్ళిపోతున్నాడు అన్నమాట. ఇదిలా ఉండగా ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ రాజ్యాంగ విరుద్ధమని సాదాసీదా రాజకీయ పరిజ్ఞానం ఉన్న వారికి కూడా తెలుస్తుంది. కానీ గవర్నరు మాత్రం కనీసం న్యాయ సలహా తీసుకోకుండా గంటల వ్యవధిలోనే ఆమోదించి సంతకం పెట్టారనే విమర్శలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వం పంపిన నిమిషాల్లోనే సంతకం చేసిన గవర్నర్ హైకోర్టు ఆదేశాలను పాటించి అంతే సమయంలో మళ్లీ తనకు ఉన్న పవర్ లో నిమ్మగడ్డ నిమాయకం జరుపుతారా లేదా అన్నది ఇక్కడ సందేహాస్పదం.

ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్న బిశ్వభూషణ్ హరిచందన్.. ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారన్నదే ఇప్పుడు చర్చ. నిమ్మగడ్డ విజ్ఞాపన పత్రం తీసుకుని సైలెంట్‌గా ఉండిపోతారా.. లేక హైకోర్టు తీర్పును అమలు చేయమని.. ప్రభుత్వానికి సూచిస్తారా.. అన్నది ఆసక్తికరంగా మారుతోంది. అందుకే.. అందరి చూపూ రాజ్‌భవన్‌ వైపు మళ్లుతోంది.

author avatar
arun kanna

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju