NewsOrbit
న్యూస్ సినిమా

RRR: ఊపిరిబిగపట్టే అప్డేట్ ఇచ్చిన ‘ఆర్ఆర్ఆర్’..! ఆరోజున..

big update from rrr team

RRR: ఆర్ఆర్ఆర్ RRR ‘మాహిష్మతీ.. ఊపిరి బిగపట్టుకో.. నా కొడుకొచ్చాడు..’ అని బాహుబలి సినిమాలోని డైలాగ్. అక్కడ మాహిష్మతి గురించి పక్కనపెడితే.. ఆ డైలాగ్.. ఆ సీన్ తో ధియేటర్లో సినిమా చూస్తున్న ప్రేక్షకులు మాత్రం సీట్లలో అతుక్కుపోయారు.. ఊపిరి బిగపట్టి చూశారు.. సినిమాకు భారీ విజయాన్ని అందించారు. రాజమౌళి చేసిన మ్యాజిక్ కు దేశం మొత్తం ఇదే పరిస్థితి. ఇప్పుడు అదే రాజమౌళి.. అదే బాహుబలి తర్వాత చేస్తున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఇప్పుడీ సినిమాపై కూడా దేశం మొత్తం అవే అంచనాలు. సినిమా ప్రారంభమై రెండేళ్లైనా కరోనా కారణంతో షూటింగ్, సినిమా విడుదల ఆలస్యమయ్యాయి. ఇప్పుడు ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఇప్పుడీ సినిమాపై ఊపిరి బిగపట్టించే అప్డేట్ ఇచ్చింది చిత్ర యూనిట్.

big update from rrr team
big update from rrr team

‘ROAR OF RRR’ అంటూ మేకింగ్ వీడియో రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది. జూలై 15వ తేదీన ఉదయం 11 గంటలకు ఈ వీడియోను రీలీజ్ చేస్తున్నట్టు అఫిషియల్ గా ప్రకటించింది. ఈమేరకు సోషల్ మీడియా ద్వారా వివరాలు వెల్లడించింది. దీంతోపాటు సినిమాకు సంబంధించిన భారీ సెట్ ను బ్యాక్ డ్రాప్ లో చూపిస్తున్నారు. మేకింగ్ వీడియో కాబట్టి ఈ పిక్ లో క్రేన్లు, బ్లాక్, బ్లూ స్క్రీన్లు ఉన్నాయి. బ్రిటషర్ల కోటను తలపిస్తున్న ఈ సెట్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా అయితే సోషల్ మీడియాలో మొదలైపోయింది. జూలై 15 వరకూ ఆగడం కష్టం.. అంటూ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Read More: RRR: RRR సినిమాలో రాజమౌళి మార్క్ స్పెషల్ ఫైట్ సీన్..??

దేశవ్యాప్తంగా భారీ క్రేజ్ దక్కించుకున్న ఆర్ఆర్ఆర్ పై అంచనాలు పెరిగిపోతూనే ఉన్నాయి. రామ్ చరణ్, ఎన్టీఆర్ లుక్స్, స్టిల్స్, మోషన్ టీజర్స్ అన్నీ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇప్పుడు మేకింగ్ వీడియోతో ఆ హైప్ ను ఆకాశమంత ఎత్తులో నిలబెడతారని చెప్పాలి. రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ మొత్తం పూర్తైందని ఇటివలే వార్తలు వచ్చాయి. సినిమా విడుదల తేదీని గతంలోనే ప్రకటించారు. సినిమా బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. అజయ్ దేవ్ గన్, అలియా భట్, ఒలివియా మోరిస్, శ్రియ, సముద్రఖని.. తదితరులు నటిస్తున్నారు.

 

 

 

author avatar
Muraliak

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N