ఇది సోషల్ మీడియా యుగం. ఇక్కడ ఫేమస్ కావాలన్నా.. ఉన్న ఫేమస్ పోవాలన్నా.. క్షణం పట్టదు. ఓవర్ నైట్ లో స్టార్లు అయిన వాళ్లను ఎంతోమందిని చూశాం. అంతా సోషల్ మీడియా పుణ్యం.

ఆ సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఫేమస్ అయింది జూనియర్ సమంత. అదేనండి.. బిగ్ బాస్ 3 కంటెస్టెంట్ అషు రెడ్డి. చూడటానికి అచ్చం సమంతలా ఉంటుందని.. అందరూ తనను జూనియర్ సమంత అని పిలుస్తుంటారు.

డబ్ స్మాష్, టిక్ టాక్ వీడియోలు చేస్తూ బిగ్ బాస్ సీజన్ 3 లో చోటు దక్కించుకుంది అషు రెడ్డి. తాజాగా జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది.

నిజానికి అషు రెడ్డి.. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఒకవేళ.. జబర్దస్త్ కు యాంకర్ గా వెళ్లడానికి ట్రై చేస్తుందేమో అని.. అందుకే తాగుబోతు రమేశ్ స్కిట్ లోకి ఎంట్రీ ఇచ్చిందని అంటున్నారు.
అవును.. అషు రెడ్డి.. తాగుబోతు రమేశ్ స్కిట్ లో ఓ క్యారెక్టర్ చేసింది. అమ్మో.. అమ్మో.. మెల్లగా జబర్దస్త్ లోకి వచ్చి.. ఇప్పుడు యాంకర్ అనసూయకు పోటీ ఇద్దామనుకుంటున్నావా? అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఇప్పటికే బిగ్ బాస్ కంటెస్టెంట్లు రోహిణి, హిమజ.. జబర్దస్త్ లో అలరించిన విషయం తెలిసిందే. రోహిణి అయితే ప్రతి ఎపిసోడ్ లో ఏదో ఒక స్కిట్ లో దర్శనం ఇస్తోంది. తాజాగా అషు రెడ్డి వచ్చి చేరింది. చూద్దాం.. భవిష్యత్తులో అషు రెడ్డి.. జబర్దస్త్ లో ఏ స్థానంలో ఉంటుందో?
దీనికి సంబంధించిన ప్రోమోను ఇటీవల విడుదల చేశారు.