హిమజ.. డేరింగ్ డాషింగ్ గర్ల్.. అంటూ బిగ్ బాస్ హౌస్ లో తనను ఆటపట్టించేవారు గుర్తుందా? చూడటానికి ముద్దుగానే ఉంటుంది. తెలుగమ్మాయే. ఆంధ్రా తనది. గుంటూరు జిల్లా వీర్లపాలెం. నటి కాకముందు తను స్కూల్ టీచర్. ఎన్నో కష్టాలు అనుభవించి.. ఇండస్ట్రీలో అవకాశాలను అందిపుచ్చుకుందట హిమజ. ప్రస్తుతం తనకు టాలీవుడ్ లో మంచి డిమాండే ఉంది. సినిమాలతో పాటు… బుల్లి తెర మీద కూడా కొన్ని ప్రోగ్రామ్స్ లో పాల్గొంటూ అందరినీ అలరిస్తోంది హిమజ.

తాజాగా హిమజ.. ఆలీతో సరదాగా షోలో పాల్గొన్నది. ఆమెతో పాటు జబర్దస్త్ టీమ్ లీడర్ చలాకీ చంటీ కూడా వచ్చాడు. ఇద్దరూ తమ సినీ, వ్యక్తిగత జీవితం గురించి ఆలీకి వెల్లడించారు.
ఈసందర్భంగా ఆలీ.. హిమజ ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నావు? అని అడగగా… పెళ్లి అనేది అంత ఇంపార్టెంటా సార్ లైఫ్ లో. పెళ్లి చేసుకోకపోతేనే బాగుంటదనిపిస్తోంది సార్.. అంటూ హిమజ ఆలీకి చెబుతుంది.
దీంతో వెంటనే చంటీ అందుకొని స్టార్టింగ్ అలాగే ఉంటదండి… అని అంటాడు. నీ అభిప్రాయం ఏంటి చంటి పెళ్లి మీద అని చంటీని అడగగా… చేసుకోవాలండి పెళ్లి.. అని అంటాడు చంటి.. అలా.. ఆలీతో సరదాగా షో సరదాగా గడిచిపోతుంది. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో ఉంది.