బిగ్ బాస్ 4: దెబ్బకి ఒకటైపోయిన అభిజిత్, అఖిల్..!!

నాలుగో సీజన్ బిగ్ బాస్ షోలో ఎక్కువ హైలెట్ అయ్యింది అభిజిత్, అఖిల్, మోనాల్. ప్రారంభంలో ఈ ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నెలకొన్నట్లు షో ప్రోజెక్ట్ అయ్యింది. మొదటి వారంలో అభిజిత్ – అఖిల్ ఇద్దరు క్లోజ్ గా వుంటూ మరోపక్క మోనాల్ కి దగ్గరవ్వటం జరిగింది. ఇద్దరూ ఆమెను జాగ్రత్తగా చూసుకోవటం.. మాత్రమే కాకుండా బాగా ఫ్రెండ్స్ గా మారిపోయారు. అఖిల్ – మోనాల్ పై కాస్త ఎక్కువ కేర్ తీసుకోవడం జరిగింది.

Akhil and Abhijeet: Who is Monal's choice?ఇలాంటి పరిస్థితుల్లో మోనాల్ తనకి అఖిల్ దగ్గరవుతున్నకొద్దీ అభిజిత్ కి దూరం అయింది. ఈ క్రమంలోనే బేధాభిప్రాయాలు రావడంతో అఖిల్ – అభిజిత్ లా మధ్య వివాదాలు నెలకొని నామినేషన్ లలో నువ్వానేనా అన్నట్టుగా ఇద్దరి మధ్య గొడవ కొన్ని వారాల పాటు కొనసాగింది. అయితే ఇటీవల మోనాల్ అభిజిత్ తో ఉన్న గొడవ అదేవిధంగా డౌట్స్ దసరా ముందు నాడు క్లియర్ చేసుకోవడం జరిగింది.

 

ఇదిలా ఉండగా ఇటీవల శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో 55 రోజుల బిగ్ బాస్ జర్నీ గురించి…. చూపించగా అందులో ఎక్కువగా షో నిర్వాహకులు…ఎక్కువగా అభిజిత్, మోనాల్.., అఖిల్, మోనాల్ రిలేషన్ పై స్పెషల్ ఫోకస్ చూపించారు. ఇదేదో ప్రేమదేశం కాన్సెప్ట్ లా అనిపించినా ఫైనల్ గా ఈవారం వారు ముగ్గురు కలిశారు. ఇప్పటివరకు నువ్వానేనా అన్నట్టుగా ఆడిన అభిజిత్…  అఖిల్ రాబోయే రోజుల్లో ఇద్దరు కలిసి పోవటంతో మళ్లీ ఫ్రెండ్స్ అయిపోవడంతో ఇద్దరూ కలిసి ఆడే గేమ్ చూడాలని బయట జనాలు కోరుకుంటున్నారు.