బిగ్ బాస్ 4: హౌస్ లో మా వాడికి పోటీ ఆ కంటెస్టెంట్ యే అంటున్న అభి తల్లి..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ ప్రేక్షకులను ఎంతగానో ఎంటర్టైన్ చేస్తూ చివర దశకు చేరుకుంది. 12వ వారం చివరి దశకు రావడంతో ఎలిమినేషన్ సమయం ఆసన్నం అవడంతో ఈసారి ఇంటి నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న దాని విషయంలో బయట చాలా ఉత్కంఠత నెలకొంది. అందుతున్న సమాచారం ప్రకారం అఖిల్ గాని అరియానా గాని ఈసారి ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉందని బయట టాక్ గట్టిగా వస్తుంది.

Dethadi Harika Too Eliminated From Bigg Boss Telugu 4 House But Here Is The Twistఇదిలా ఉండగా ఇటీవల బయట యాంకర్ రవి తో హారిక వాళ్ల మదర్ అదేవిధంగా అభిజిత్ వాళ్ళ మదర్ ఇంటర్వ్యూ లో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఇద్దరి ఫ్రెండ్షిప్ గురించి ఇద్దరి మదర్స్ చాలా గొప్పగా చెప్పుకున్నారు. ముఖ్యంగా హారిక ని చూశాక తన కంటూ ఒక ఆడపిల్ల ఉంటే బాగుండేది అని అనిపించింది అంటూ అభిజిత్ వాళ్ళ తల్లి తెలిపింది.

ఇదే సమయంలో హారిక వాళ్ళ తల్లి ఇలాంటి కాలంలో చాలా ఓపికగా ఉండే అబ్బాయిలు చాలా తక్కువ కానీ అభిజిత్ కి చాలా ఓపిక ఉందని మంచి అబ్బాయి అంటూ ప్రశంసించారు. ఇదిలా ఉండగా కచ్చితంగా ఇంటిలో అభిజిత్ కి టాఫ్ ఫైట్ ఇవ్వటంలో హారిక ముందుంటుందని బల్లగుద్ది చెబుతాను అంటూ అభిజిత్ వాళ్ళ తల్లి ఇంటర్వ్యూలో తెలిపింది. ఇదిలా ఉండగా కచ్చితంగా ఇద్దరు మాత్రం టాప్-5లో కి వెళతారని అందులో డౌటే లేదని పోటాపోటీగా ఇద్దరి ఆట ఉన్నట్లు ఇంటర్వ్యూలో ఇద్దరు కంటెస్టెంట్ ల తల్లులు చెప్పుకొచ్చారు