నోయల్ ఇంటి నుండి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ స్టేజి పై మాట్లాడిన మాటలు సోమవారం జరగబోయే ఎలిమినేషన్ ఎపిసోడ్ లో ఇంటి సభ్యుల మధ్య మంచి కాకను పుట్టించినట్లు ప్రోమో బట్టి తెలుస్తోంది. నామినేషన్ ప్రక్రియ లో నామినేట్ చేసే సభ్యుడి తలపై గుడ్డు కొట్టడం, పైగా ఒకరు ఇద్దరు తలపై గుడ్డు కొట్టి నామినేట్ చేయాలని బిగ్ బాస్ ఆదేశించిన క్రమంలో… ఇంటిలో ఎంత క్లోజ్ గా ఉండే జంట గా పేరొందిన అఖిల్…మోనాల్ నీ నామినేట్ చేయడం అందరికీ షాక్ కి గురిచేసింది.
అమ్మ రాజశేఖర్ ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఈ నామినేషన్ ప్రక్రియలో భాగంగా అమ్మ రాజశేఖర్ కి అభిజిత్ కి మధ్య గొడవ భారీ స్థాయిలో జరిగినట్లు అర్థమవుతుంది. నోయల్ ఇంటి నుండి వెళ్తూ చేసిన కామెంట్లు… ఇంటి సభ్యులను బాగా ప్రభావితం చేసినట్లు… తాజా నామినేషన్ ప్రోమో బట్టి అర్థమవుతోంది.
ఈ క్రమంలో ఆరియనా… సొహైల్ నీ నామినేట్ చేయడంతో… ఆవేశంతో ఊగి పోయాడు. మొత్తం మీద ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియలో ఇంటి సభ్యుల మధ్య గొడవలు భారీస్థాయిలో జరిగినట్లు అర్థమవుతుంది. ముఖ్యంగా అఖిల్ అభిజిత్ మోనల్ కలిసిపోయారు ఇంకా వారి మధ్య ఎలాంటి గొడవలు ఉండవు అనే అందరూ అనుకున్న తరుణంలో అఖిల్ ఒక్కసారిగా మోనాల్ కి రివర్స్ అవ్వటం ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకు అఖిల్ ఈ విధంగా మోనాల్ కి రివర్స్ అయిపోయాడు అన్న డిస్కషన్లు సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యాయి.