హిందీ, తమిళం, తెలుగులో బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రసవత్తరంగా సాగుతోంది. బాలీవుడ్ లో ఏకంగా 13 సీజన్లు కంప్లీట్ చేసుకోగా.. తెలుగు, తమిళంలో నాలుగో సీజన్ జరుగుతోంది. అయితే ఇప్పటి వరకు ఏ భాషలోను బిగ్ బాస్ సీజన్స్ లో కనిపించని సంఘటన తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో జరగడం ఒకింత షాక్ కి గురి చేసింది. బిగ్ బాస్ అంటేనే అందమైన ముద్దుగుమ్మలు.. యంగ్ అండ్ డైనమిక్ కుర్రాళ్ళ తో నానా హంగామా.. రొమాన్స్..కాంట్రవర్సీలు..రచ్చ..అని అందరూ ఫిక్సైపోయారు.
అలాంటిది మొదటిసారి 60 ఏళ్ళ వయసున్న ఒక పల్లెటూరు వ్యక్తి, చదువుకోని గంగవ్వను బిగ్ బాస్ సీజన్ లోకి తీసుకోవడం పెద్ద ప్రయోగమని చెప్పాలి. హిందీలో బిగ్ బాస్ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగులో జరిగిన 3 సీజన్స్ వరకు ఇలాంటివి జరగలేదు. అంతేకాదు ఇకపై జరిగే అవకాశం కూడా చాలా తక్కువని అంటున్నారు. యూట్యూబ్ స్టార్ అయిన గంగవ్వకు తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె వీడియోలకు మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా బిగ్ బాస్ ఎంపిక చేసేది ఇలాంటి యూట్యూబ్ స్టార్స్ నే. అందుకే ఈసారి గంగవ్వ అవకాశం దక్కించుకుంది.
గంగవ్వ బిగ్ బాస్ కు వెళ్లినప్పటినుంచి ప్రేక్షకులు మొత్తం తన వేనకే ఉన్నారు. మొదటి వారంలోనే గంగవ్వ ఎలిమినేషన్ కు నామినేట్ అవ్వడంతో భారీగా ఓట్లు పడ్డట్లుగా సమాచారం. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఈసారి అయిదు కోట్లకు పైగా ఓట్లు నమోదు అయినట్లుగా నాగార్జున ప్రకటించాడు. అందులో దాదాపుగా సగం ఓట్లు గంగవ్వకు వచ్చినట్టుగా సమాచారం. అంటే బిగ్ బాస్ లో గంగవ్వకి క్రేజ్ బాగానే ఉంది. బిగ్ బాస్ గంగవ్వని ఎక్కువ రోజులే షో ఉండేలా అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తుంది.
గంగవ్వ ఉన్నన్ని రోజులు మంచి ఎంటర్ టైన్మెంట్ గా షో సాగుతుందని కొందరు బలంగా నమ్ముతున్నారట. కాని మరికొందరు మాత్రం ఆమె వల్ల షో అనుకున్నంత రసవత్తరంగా సాగడం లేదని అంటున్నారట. బిగ్ బాస్ టాస్క్ లను గంగవ్వ చేయడం కష్టమే. కాబట్టి గంగవ్వకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం కంటెస్టెంట్స్ కు తక్కువ ప్రాధాన్యత ఇవ్వడంలో కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయంటున్నారు. ఇక వయసు రిత్యా గంగవ్వ ని చిన్న కామెంట్స్ చేసినా జనాల రియాక్షన్ ఎలా ఉంటుందో ఈపాటికే అర్థమైపోయింది. ఈ క్రమంలో షో కాస్త దెబ్బతింటుందన్న భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.