బిగ్ బాస్ 4: హౌస్ లో పేరెంట్స్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన అమ్మరాజశేఖర్..!!

బిగ్ బాస్ హౌస్ లో అమ్మ రాజశేఖర్ చాలా బ్యాలెన్సింగ్ గేమ్ ఆడుతూ రాణిస్తున్నారు. ఒకపక్క ఎంటర్టైన్ చేస్తూనే మరోపక్క టాస్క్ విషయానికి వచ్చే సరికి 100% కృషితో ఏదో రకంగా నెట్టుకొస్తున్నారు. గత సీజన్ లో బాబా భాస్కర్ మాదిరి అంత కాకపోయినా ఆ తరహాలోనే అమ్మరాజశేఖర్ వ్యవహారం కూడా ఉంది. ఇదిలా ఉండగా సెవెంత్ వీక్ లో నామినేషన్ ప్రక్రియలో భాగంగా అమ్మ రాజశేఖర్ పేరెంట్స్ టాపిక్ వచ్చేసరికి ఆయన చేసిన వ్యాఖ్యలు హౌస్ లో కలకలం రేపుతున్నాయి.

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar, Mehboob May In Nominations - Sakshiతాజాగా నామీ నేషన్ కి సంబంధించిన ప్రోమో… రిలీజ్ అయిన తరుణం లో  అందులో అమ్మ రాజశేఖర్… గతంలో అభిజిత్, అఖిల్, మోనాల్ కి జరిగిన గొడవ మళ్లీ ఎత్తి చూపటం జరిగింది. దీంతో ఈ విషయంలో చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యాడు అఖిల్. తాను అభిజిత్ తో మోనాల్ మాట్లాడక పోవటం ఆమె ఇష్టం. నేను తనను ఆపలేదు అని క్లారిటీ ఇచ్చాడు.

 

అంతేకాకుండా నేను అన్న మాటకు బయట మా పేరెంట్స్ కూడా హర్ట్ అయి ఉండవచ్చని అఖిల్ చెబుతూ ఉండగా మాస్టర్ మధ్యలో కలుగజేసుకుని ఎవరికీ పేరెంట్స్ లేరు? అంటూ ఆవేశంతో విరుచుకుపడ్డారు. నువ్వు పెద్ద నేరం చేశావంటూ అభివృద్ధి తొలిసారి మోనాల్ నీ ఈ ప్రక్రియలో నామినేట్ చేయడం జరిగింది. మొత్తంమీద సెవెంత్ వీక్ లో నామినేషన్ ప్రక్రియ లో మోనాల్ వ్యవహారం మరోసారి హైలెట్ అయ్యేటట్టు ఉంది.