బిగ్ బాస్ 4 : హౌస్ లో ఉన్న లాస్య పై బయట అమ్మరాజశేఖర్ భార్య సీరియస్..!!

బిగ్ బాస్ సీజన్ ఫోర్ లో ఇంటిలో ఎంటరైన సభ్యులలో ఆడియన్స్ కి తెలిసిన వారిలో ప్రముఖులు లాస్య, అమ్మ రాజశేఖర్. వీరిద్దరిని టెలివిజన్ ప్రేక్షకులు బాగానే గుర్తు పట్టడం జరిగింది. ఇదిలా ఉండగా షో లో ఆడుతున్న కంటెస్టెంట్స్ కుటుంబీకులను బయట పలు వెబ్ మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో అమ్మ రాజశేఖర్ భార్య రాధ ఇటీవల ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆమె షాకింగ్ కామెంట్ చేసింది. పూర్తి విషయంలోకి వెళితే బిగ్ బాస్ షో ప్రారంభంలో హౌస్ లో ఓ కార్యక్రమం నిర్వహించారు.

Amma Rajasekhar Wife: లాస్య నా భర్తపై నింద వేసింది.. ఆమె ఆ టైప్ అనుకుంటా  అందుకే..: అమ్మా రాజశేఖర్ భార్య షాకింగ్ కామెంట్స్ - bigg boss contestant amma  rajasekhar wife radha ...ఆ కార్యక్రమంలో అమ్మ రాజశేఖర్ కి వ్యతిరేకంగా యాంకర్ లాస్య, టీవీ9 రిపోర్టర్ దేవి నాగవల్లి అమ్మ రాజశేఖర్ పై చేసిన ఆరోపణల మాట్లాడిన ప్రస్తావన… ఇటీవల అమ్మ రాజశేఖర్ భార్య రాధా ఇంటర్వ్యూలో లేవనెత్తారు. అమ్మ రాజశేఖర్ కామెడీ ఓవర్ గా ఉందని ఆయన ప్రవర్తన నచ్చటం లేదని మెడ పట్టుకుని బయటకు గెంటి వేయాలని ఉందని… లాస్య దేవి నాగవల్లి మాట్లాడారు. ఆ మాటలు నాకు ఎంతగానో బాధనీ కలిగించాయి. అదేవిధంగా తన భర్త మాటలు విని అవమానంగా ఫీల్ అయ్యి హౌస్ లో కన్నీరు పెట్టుకోవడమే కాక ఇంటి నుండి బయటకు పంపాలని కోరారు.

 

అసలా సన్నివేశం చూసినప్పుడు తనకు ఆ ఇద్దరిపై అసహనం కలిగిందని రాజశేఖర్ భార్య చెప్పుకొచ్చారు. వృత్తి పరంగా నా భర్త అనేక మంది అమ్మాయిలతో పని చేశారు, కానీ ఇలా చాలా రిజర్వుడు అనుకుంటా…. అందుకే నా భర్త పై నిందలు వేసింది. చెయ్యని తప్పు నా భర్తపై వేసినందుకు నేనే కాదు ఇంటిలో ఉన్న మా ఆయన కూడా తట్టుకోలేక పోయారు.. అంటూ బాధపడ్డారు. ఇదిలా ఉండగా గత సీజన్ లో బాబా భాస్కర్ మాదిరిగా ఈ సీజన్ లో అమ్మరాజశేఖర్ పెర్ఫార్మెన్స్ హౌస్ లో చాలా బాగుందని బయట జనాలు ఆయన ఆటతీరుపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.