బిగ్ బాస్ సీజన్ ఫోర్ ఆఖరి దశకు వచ్చిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఇంటిలో ప్రస్తుతం ఎనిమిది మంది సభ్యులు మిగిలి ఉన్నారు. ఇంట్లో వాతావరణం చూస్తే నువ్వానేనా అన్నట్టుగా ఉంది. మరోపక్క బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు అదేవిధంగా షాక్ లు చూస్తున్న ఆడియన్స్ కి షో పై ఇంట్రెస్ట్ పుట్టిస్తున్నాయి. పరిస్థితి ఇలా ఉండగా హౌస్ లో చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ ఆట ఆడి, ముక్కు సూటిగా తన అభిప్రాయాన్ని తెలుపుతూ తన అందచందాలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన కంటెస్టెంట్ దివి.
ఇంటిలో టాస్క్ లో తన బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి అమ్మ రాజశేఖర్ కి బాగా క్లోజ్ గా ఉంటూ, ఇంటి సభ్యులందరితో పాజిటివ్ గానే వ్యవహరించింది. అటువంటి దివి సరిగ్గా దసరా ఎపిసోడ్ నాడు హౌస్ నుండి ఎలిమినేట్ అయింది. దసరా ఎపిసోడ్ రోజు సమంత యాంకరింగ్ చేసే సమయంలో బయటకు వచ్చిన దివి. మొన్నటి వరకు సోషల్ మీడియాలో వీడియో లు పెడుతూ అదేవిధంగా వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తూ వచ్చింది.
ఇదిలా ఉండగా తాజాగా దివి పొలంలో పనులు చేసుకుంటూ ఉంది. వాటికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. పచ్చని వాతావరణంలో దివి పొలం లో దిగిన ఫోటో.. వైరల్ గా మారింది. మట్టి పని చేసుకుని తరహాలో ఆమె ఫోజ్ ఇవ్వటంతో కామెంట్లు భారీ స్థాయిలో వస్తున్నాయి. పొలం లో దిగిన మెరుపుతీగ, పొలంలో టాలీవుడ్ దీపికాపదుకునే అంటూ కామెంట్లు పెడుతున్నారు.