బిగ్ బాస్ హౌస్ లో లేడీ కంటెస్టెంట్ లలో ఫస్ట్ నుండి చాలా టాప్ ఫైట్ ఇస్తున్న కంటెస్టెంట్ గా అరియనా ఆడియన్స్ లో మంచి గుర్తింపు పొందింది. అపోజిట్ ఎవరైనా సరే వాదనలు వినిపించడంలో తన పాయింట్ చెప్పటంలో అరియనా స్టైలే వేరు అన్నట్టు రాణించింది. ఆఖరికి ఇంటిలో ఉండే టాక్ బలమైన కంటెస్టెంట్ లు కూడా అరియనా ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి.
ముక్కుసూటి మనిషి అని ఉన్నది ఉన్నట్టు చెప్పటం లో ఆమెను మించిన వారు మరొకరు ఉండరు అని చాలా క్లారిటీగా అరియనా గేమ్ ఆడుతోందని చాలామంది చెప్పుకోస్తారు. ఇదిలా ఉండగా ఇటీవల కెప్టెన్ అయిన తర్వాత హౌస్ లో ఎవరు వ్యవహరించని విధంగా అరియనా తన రూల్స్ తో ఇంటి సభ్యులకు చుక్కలు చూపించడంతో బుధవారం లో ఆమె పై వ్యతిరేకత ఒక్కసారిగా పెరిగిపోయింది. నామినేషన్ సందర్భంలో చాలామంది అరియనా ని నామినేట్ చేయడం జరిగింది.
దీంతో ఇంటిలో ఒక్కసారిగా వ్యతిరేకత ఇంతగా తన పైన రావడంతో అరియనా…హౌస్ లో ఎంత గడుసుగా గరుకుగా ఉండే అరియనా కెమెరా ముందుకు వచ్చి బోరున ఏడ్చేసింది. అంతేకాకుండా బిగ్ బాస్ నేనిక్కడ ఉండలేకపోతున్నా.. నన్ను పంపించేయండి బిగ్ బాస్.. నేను ఒంటరి అయిపోతున్న ఫీలింగ్ వస్తుంది.. నా లైఫ్లో ఇలాంటి మనుషులను ఎప్పుడూ చూడలేదు.. నేనిక్కడ ఉండలేకపోతున్నా.. నేను మీరు అనుకున్నంత స్ట్రాంగ్ కాదు బిగ్ బాస్.. నా వల్ల కావట్లేదు.. దయచేసి నన్ను పంపేయండి బిగ్ బాస్ అంటూ వేడుకుంది. అది కూడా ఏడుస్తూ దీనంగా వేడుకుంది అరియానా. దీంతో ఈ ఫోటో చూసిన బయట జనాలు సోషల్ మీడియాలో నెటిజన్లు… కెప్టెన్ గా ఉన్న సమయంలో సరిగ్గా వ్యవహరించి ఉంటే ఈ కన్నీళ్ళు వచ్చేవి కాదని వ్యాఖ్యానిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?