బిగ్ బాస్ 4: నీకు పెళ్లి అవ్వదు అంటూ ఆ కంటెస్టెంట్ కి శాపం పెట్టిన అరియానా..!!

బిగ్ బాస్ హౌస్ లో అరియానా సీక్రెట్ రూమ్ నుండి ఎంట్రీ ఇవ్వగా ఆ సమయంలో ఎక్కువగా సోహెల్ తో ఫ్రెండ్షిప్ చేయడం జరిగింది. ఆ తర్వాత అరియానా తన గేమ్ పై ఫోకస్ పెట్టి మంచి పోటీ ఇవ్వడం జరిగింది. కాగా వైల్డ్ కార్డు రూపంలో అవినాష్ ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాక చాలావరకూ అరియానా అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ వస్తుంది.

Bigg Boss 4 Telugu Exclusive: Captain chance for these two contestantsఒకానొక సమయంలో అవినాష్ ఇంటి నుండి ఎలిమినేట్ అవటం గ్యారెంటీ అన్న తరహాలో పరిస్థితి మారటంతో అరియానా దారుణంగా హోస్ట్ నాగార్జున ముందే ఏడవటం జరిగింది. అంతలా ఇద్దరు హౌస్లో కలిసిపోయారు. అయితే ఇద్దరి మధ్య లవ్ ట్రాక్ కూడా నడుస్తున్నట్లు మరో టాక్ బయట వస్తుంది. ఇదిలా ఉండగా శుక్రవారం జరిగిన ఎపిసోడ్ లో ఉదయం కిచెన్ వద్ద టిఫిన్ తీసుకుంటూ అరియానా అవినాష్ మాట్లాడిన మాటలు చూస్తున్న ప్రేక్షకులకు ఎంతగానో నవ్వు పుట్టించాయి.

 

అరియానా.. అవినాష్ తో మాట్లాడుతూ నేను చాలా సార్లు హౌస్ లో నిన్ను సపోర్ట్ చేశాను అంటూ తెలిపింది. ముఖ్యంగా ఈ వారంలో ఎవిక్షన్ పాస్ లభించడంలో కూడా నేను నీ వెంట ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అవినాష్ స్పందిస్తూ నేను కూడా నీ కోసం చాలా చేశాను అన్నాడు. ఏం చేశావు నువ్వు అంటూ ఎదురు ప్రశ్నించింది. ప్రతి రోజు నేనే కదా నీకు తినిపించింది. ఆరోగ్యం బాగా లేని సమయంలో చాలా చేశాను అంటూ అవినాష్ చెప్పుకొచ్చాడు. ఆ సమయంలో ఇద్దరు కూడా ఫన్నీగా తిట్టుకోవడం మొదలు పెట్టారు. ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకున్నారు ఈ నేపథ్యంలో రాబోయే రెండు మూడు సంవత్సరాలు నీకు పెళ్లి కాకూడదు అంటూ భగవంతునికి ప్రార్థిస్తాను అని అరియానా గట్టి శాపం పెట్టింది. దీంతో వెంటనే షాకైన అవినాష్ దొంగ మొహం దాన ఖచ్చితంగా వచ్చే ఏడాది మే లోపు నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఛాలెంజ్ విసిరాడు.