బిగ్ బాస్ 4: ఆ కంటెస్టెంట్ కి గట్టిగా హాగ్ ఇచ్చి బిగ్ కిస్ ఇచ్చిన అరియానా..!!

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ ఫోర్ చివరి దశకు చేరుకుంది. ఇంకా మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇంటిలో వాతావరణం క్షణక్షణానికి మారిపోతుంది. ప్రస్తుతం ఇంటిలో సభ్యులు ఏడుగురు మాత్రమే మిగిలి ఉన్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ స్టార్టింగ్ లో సీక్రెట్ రూమ్ లో కంటెస్టెంట్ లుగా అరియానా, సోహెల్ ఉండి హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

News18 Telugu - Bigg Boss 4 Telugu: ఇస్మార్ట్ సోహైల్‌ను చూపులతోనే వణికించిన  అరియానా.. | Bigg Boss 4 Telugu Ariyana Glory Intimidating Sohail with her  killing looks pk- Telugu News, Today's Latest News in Teluguఅప్పుడు బాగా క్లోజ్ గా ఉన్న బయటకు వచ్చాక ఇద్దరికీ చాలా సార్లు నువ్వానేనా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. అరియానా కెప్టెన్ అయిన సమయంలో చాలాసార్లు సోహెల్ తో గొడవలు అవ్వటం మనం అందరం చూశాం. ఆ తర్వాత కూడా అనేక వారాలు గొడవ పడుతూనే ఉన్నారు. ఎలిమినేషన్ నామినేషన్ ప్రక్రియ లో ఎప్పుడూ ఒకరిని మరొకరు నామినేట్ చేసుకుంటూ వచ్చారు.

 

కానీ అనూహ్యంగా సోమవారం జరిగిన ఎపిసోడ్ లో అరియానాకి ఏమైందో తెలియదు కానీ ఎవరూ ఊహించని విధంగా ప్రవర్తించింది. సోహెల్ అరియానా కిచెన్ రూంలో ఉండగా.. అరియానా వచ్చింది సోహెల్‌ను గాఢంగా హత్తుకుంది. బుగ్గపై ముద్దు పెట్టేసింది. సారీ రా.. నువ్వంటే నాకు ఎప్పుడూ ఇష్టమేరా.. కానీ మన మధ్య ఎప్పుడూ ఏదో ఒక గొడవ వస్తూనే ఉంటుందని అరియానా ఎమోషనల్ అయింది. ఇంతలోనే మళ్లీ నామినేషన్ ప్రక్రియ వచ్చేసరికి సోహెల్‌ను అరియానా నామినేట్ చేయడం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురి చేసింది.