బిగ్ బాస్ 4: ఉన్న కొద్దీ ఆ టాప్ కంటెస్టెంట్ గ్రాఫ్ కిందకి…??

బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి అర్థంకాని పరిస్థితిలో ఉంది. కంటెస్టెంట్ ల మధ్య ఉన్న బంధం ఎక్కువ సేపు ఉండేలా కాకుండా వాళ్ళ వ్యక్తిత్వం బయటపడేలా బిగ్ బాస్ గేమ్ చివరికి వచ్చే సమయానికి సరికొత్త టాస్క్ లతో ఇంటి సభ్యులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం 12వ వారం లో కొనసాగుతున్న సీజన్ ఫోర్ చాలా రసవత్తరంగా ఉంది.

Bigg Boss Telugu 4: Akhil Sarthak Gets Trolled For His Commentary Inside  The Secret Room! - Filmibeatకేవలం ఏడుగురు మాత్రమే ఇంటిలో సభ్యులు మిగిలి ఉన్నారు. ఇంకా నాలుగు వారాల ఆట మాత్రమే మిగిలి ఉంది. పరిస్థితి ఇలా ఉండగా షో స్టార్ట్ అయిన నాటి నుండి టాప్ కంటెస్టెంట్ లుగా వినబడుతున్న పేరులో ఒక పేరు అఖిల్. ఫస్ట్ నుండి హౌస్ లో అఖిల్ ఫిజికల్ టాస్క్ ఇంకా గేమ్ పరంగా అందరినీ అలరిస్తూ ఆకట్టుకుంటున్నాడు. అంతే కాకుండా అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతూ ఎంటర్ టైన్ చేస్తూ ఉన్నాడు.

 

అయితే అంతా బాగానే ఉన్నా కానీ ఇటీవల అఖిల్ తన తోటి సభ్యులతో… ముఖ్యంగా హౌస్ లో తనకి క్లోజ్ గా ముందునుంచి ఉన్న మోనాల్ తో అదే విధంగా బెస్ట్ ఫ్రెండ్ లాగా భావించే సొహైల్ తో ఇటీవల వ్యవహరించిన తీరు అఖిల్ గ్రాఫ్ అదేవిధంగా ఓటింగ్ పడిపోయినట్లు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కెప్టెన్సీ టాస్క్ సమయములో మోనాల్ వ్యవహరించిన తీరుపై అదే విధంగా సోమవారం నామినేషన్ ప్రక్రియ లో అఖిల్ మాట్లాడిన తీరు పై విమర్శలు గట్టిగా వస్తున్నాయి. అంతే కాకుండా ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఫ్రెండ్ సోహెల్ తో కూడా గొడవ పడటానికి అఖిల్ రెడీ అయినట్లు ప్రోమో లో కనబడుతుంది. దీంతో ఉన్న కొద్ది చివరిలో అఖిల్ వ్యక్తిత్వంలో చాలా మార్పు వచ్చినట్లు సోషల్ మీడియాలో బయట జనాలు డిస్కషన్స్ జరుగుతున్నాయి. అంతేకాకుండా ఈవారం ఎలిమినేషన్ లో ఉండటంతో… ఇంటి నుండి అఖిల్ ఎలిమినేట్ అయిన ఆశ్చర్యపోనవసరం లేదని తాజా పరిస్థితులపై సోషల్ మీడియాలో నెటిజన్లు డిస్కషన్లు చేసుకుంటున్నారు.