జబర్దస్త్ షో ద్వారా బాగా పాపులర్ అయిన ముక్కు అవినాష్ ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రాణిస్తున్న సంగతి తెలిసిందే. సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్ ప్రారంభంలో మస్తు ఎంటర్టైన్మెంట్ అందించాడు. అందరి పై పంచులు వేస్తూ వారిని కూడా నవ్విస్తూ ఇంటిలో రచ్చ రచ్చ చేశాడు. అయితే హౌస్ లో ఉన్న కొద్ది వాతావరణం సీరియస్ అవ్వటంతో…అవినాష్ జోకులు వేసే కొద్ది అది వేరే విధంగా వెళ్లటంతో కంటెస్టెంట్ లు అవినాష్ కి రివర్స్ అయిపోయారు.
ఇదిలాఉంటే నామినేషన్ అనేసరికి అవినాష్ నేను బైట షో లన్నీ ఆపుకొని వచ్చాను అంటూ ఏడుపు మొహం పెట్టడం పై ఆయన సపోర్టెర్స్ అదేవిధంగా ఆడియన్స్ రకరకాల కామెంట్లు చేస్తున్నారు. నామినేషన్ అంటే అవినాష్ నిరుద్యోగ కథలు చెబుతున్నాడని ఎటకారంగా అవినాష్ కి పంచ్ లు వేస్తున్నారు. అంతా బాగానే ఉన్నా టాప్ ఫైవ్ లో కి వెళ్లే ఛాన్స్ పుష్కలంగా ఉన్నా అవినాష్ భయపడటం పట్ల బయట పంచులు గట్టిగా పడుతున్నాయి.
మరోపక్క స్వయంగా అవినాష్ తమ్ముళ్ళు బయట ఇంటర్వ్యూలో “ అవినాష్ ని జబర్దస్త్ షో నుండి ఎవరూ శాశ్వతంగా బయటకు పంపించలేదని చెప్పుకొస్తున్నారు. అవినాష్ ఇష్టంతోనే బిగ్ బాస్ షో కి వెళ్లడం జరిగిందని, బిగ్ బాస్ పూర్తయ్యాక మళ్లీ జబర్దస్త్‌లో కంటిన్యూ అవచ్చు. మళ్లీ అదే టీమ్.. మాస్ అవినాష్, కెవ్వు కార్తీక్ టీమ్‌లో ఉండొచ్చు. మల్లెమాల వాళ్లు అన్నయ్యను మళ్లీ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అన్నయ్య కెరీర్లో జబర్దస్త్ ఉండదు అనేది కేవలం రూమర్లే” అని చెప్పుకొచ్చారు. దీంతో హౌస్ లో అవినాష్ సానుభూతి గేమ్ ప్రతిసారి సంపాదిస్తున్నాడు అని అవినాష్ తమ్ముళ్లు కామెంట్లు పెట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు అవినాష్ ది ఫెక్ గేమ్ అని అంటున్నారు.