బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం వేడి వేడిగా ఉంది. సీజన్ ఫోర్ జర్నీ దాదాపు సగం పూర్తి కావడంతో.. హౌస్ లో నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఉత్కంఠ చూస్తున్న ప్రేక్షకులలో నెలకొంది. ముఖ్యంగా ఇటీవల అనారోగ్యం కారణంగా నోయెల్ ఇంటి నుండి వెళ్తూ వెళ్తూ బిగ్ బాస్ స్టేజిపై ఇంటి సభ్యుల పై చేసిన కామెంట్లు హౌస్ లో మంచి కాకను పుట్టిస్తున్నాయి. మాస్టర్, అవినాష్ ని ఉద్దేశించి నోయల్ చేసిన వ్యాఖ్యలు హౌస్ మెంబర్స్ ని ఎంతగానో ప్రభావితం చేశాయి.
ఇదిలా ఉండగా తాజాగా జబర్దస్త్ షో తో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అవినాష్… తనకి మళ్లీ జబర్దస్త్ షో లో వెళ్లే అవకాశం ఉండదని, వాళ్లు తీసుకోమని చెప్పినట్లు అవన్నీ గుర్తుకొచ్చి నట్లు కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతేకాకుండా ప్రస్తుతం హౌస్లో తనలాగే అందరూ స్ట్రాంగ్ గా ఆడుతున్నారని అందుకు హ్యాపీగా ఉందని పేర్కొన్నారు.
దీంతో అవినాష్ చేసిన కామెంట్లు పై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా రియాక్ట్ అవుతున్నారు. ఎంటర్టైన్మెంట్ చేస్తే పర్లేదు గాని… అవతల వ్యక్తి నొప్పితో బాధపడుతున్న సమయంలో… ఆ నొప్పిని కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తే కచ్చితంగా సదరు వ్యక్తికి కాలుతుందని… నోయల్ విమర్శలు చేయడంలో తప్పు లేదని చాలామంది సమర్ధిస్తున్నారు. ఇదే ఈ విషయాన్ని ఈ వారం నామినేషన్ సమయంలో అవినాష్ కి చాలా మంది చెప్పటం జరిగిందని ఇప్పుడు బాగా అర్థం అయి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?