బిగ్ బాస్ హౌస్ లో వాతావరణం ఉన్న కొద్దీ రసవత్తరంగా మారుతోంది. ఇంకా రెండు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు టాప్ ఫైవ్ లో కి వెళ్ళటానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. వైల్డ్ కార్డులతో కలిపి 19 మంది ఇంటిలోకి ఎంటర్ అవగా ఏడుగురు మాత్రం ప్రస్తుతం మిగిలి ఉన్నారు. ఇదిలా ఉండగా షో జరగకముందే సోషల్ మీడియాలో లీక్ వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే.
అయితే తాజాగా మరి కొద్ది గంటల్లో ప్రసారం కాబోయే శనివారం ఎపిసోడ్ లో ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ మధ్య గొడవ జరిగినట్లు వార్త వైరల్ అవుతోంది. పూర్తి మ్యాటర్ లోకి వెళ్తే లగ్జరీ బడ్జెట్ విషయంలో అవినాష్ అదేవిధంగా అరియనా మధ్య గొడవలు చోటు చేసుకున్నట్లు, పెద్ద రాద్ధాంతం జరిగినట్లు ఇద్దరి మధ్య మాటల తూటాలు భారీ స్థాయిలో పేలినట్లు సమాచారం.
సీజన్ ఫోర్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన అవినాష్.. హౌస్ లో చాలా వరకు క్లోజ్ గా ఉన్న వారిలో అరియనా ఒకరు. మొదటి నుండి చాలా విషయాలలో అరియనా ఢీల పడిపోయినప్పుడు అవినాష్ యే సపోర్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా అవినాష్ విషయంలో కూడా అరియనా సపోర్ట్ చేసింది. ఒకానొక సందర్భంలో వీకెండ్లో అవినాష్ ఇంటి నుండి ఎలిమినేట్ అవుతారు బిగ్ బాస్ కన్ఫ్యూజన్లో పెట్టిన సమయంలో అరియనా బోరునా ఏడవటం జరిగింది. హౌస్ లో ప్రాణ స్నేహితులగా ఉండే ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు వార్తలు రావడంతో శనివారం ఎపిసోడ్ పై ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ నెలకొంది.