బిగ్ బాస్ ఇంటి లోకి హౌస్ మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చే ఎపిసోడ్ కావటంతో ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఎమోషనల్ ఎపిసోడ్ కావటంతో అందరిలో ఆసక్తి నెలకొన్న అంశం కంటెస్టెంట్ మోనాల్ ఇంటి నుండి ఎవరు వస్తారు అని. ఎందుకంటే మోనాల్ సొంత రాష్ట్రం గుజరాత్.
దీంతో అక్కడి నుండి మోనాల్ కోసం వచ్చేది ఎవరు అనే దాని విషయంలో ఇప్పుడు రకరకాల చర్చలు జరుగుతున్నాయి. అసలు వస్తారా లేదా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ వచ్చినా ఎవరు వస్తారు అనేదాన్ని విషయంలో ఆసక్తి నెలకొంది. పైగా మొదటి నుండి మోనాల్ కి కుటుంబం అంటే చాలా ఇష్టం.
దీంతో వస్తున్న టాక్ ప్రకారం ఆమె మదర్ లేదా సిస్టర్ గాని వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో బిగ్ బాస్ మోనాల్ కి ఎలాంటి సర్ ప్రైజ్ ఇస్తారో అందరిలో ఆసక్తి నెలకొంది. చాలా ఎమోషనల్ ఫ్యామిలీతో ఎటాచ్మెంట్ ఉన్న మోనాల్..షో చివరి స్టేజ్ లో ఉన్న సమయంలో ఇంటి సభ్యులకు మంచి బూస్ట్ ఇచ్చినట్లు ఉంటుంది. ముఖ్యంగా ఎలిమినేషన్ జోన్ లో మోనాల్ ఉండటంతో ఆమె కుటుంబ సభ్యులు రావటం అనేది చాలా ఆనందం కలిగించే అంశం. దీంతో మోనాల్ కోసం ఎవరు వస్తారు అనేది తెలుగు ప్రేక్షకులతో పాటు ఆమె అభిమానులు ఎదురుచూస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?