బిగ్ బాస్ 4: అమ్మ రాజశేఖర్ కి షాక్ ఇచ్చిన బిగ్ బాస్..!!

బిగ్ బాస్ నాలుగో సీజన్ స్టార్ట్ అయ్యి దాదాపు 50 రోజులకు పైగానే గడవటం అందరికీ షాక్ కి గురి చేస్తుంది. ఎప్పుడు ప్రారంభం కావలసిన బిగ్ బాస్ మధ్యలో మహమ్మారి కరోనా వైరస్ రావటంతో.. చాలా లేటుగా అనుకున్న టైం కంటే స్టార్ట్ అయ్యింది. పైగా హౌస్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్ లు ఎక్కువగా కొత్త వారు కావటంతో వారిని రిసీవ్ చేసుకోవడానికి ప్రేక్షకులు ఇంకా టైం తీసుకున్నారు.

Bigg Boss 4 Telugu: Amma Rajasekhar May Eliminate For 8th Week - Sakshiకానీ షో పై ఆడియన్స్ కి ఇంట్రెస్ట్ పోకుండా బిగ్ బాస్ షో నిర్వాహకులు ఎప్పటికప్పుడు ఇంటిలోకి వైల్డ్ కార్డు రూపంలో కొత్తవారిని పంపిస్తూ సరికొత్త టాస్క్ లతో అలరించడం జరిగింది. ఇదిలా ఉండగా ఈ వారం నామినేషన్ లో ఎక్కువగా ఇంటి నుండి ఎలిమినేట్ అయ్యే వారి గురించి బయట జరుగుతున్న చర్చలో అమ్మరాజశేఖర్ పేరు గట్టిగా వినబడుతోంది. ప్రారంభంలో హౌస్ లో అందరినీ ఎంటర్టైన్ చేస్తూ… వంట చేస్తూ అలరించిన అమ్మరాజశేఖర్… కొన్నాళ్ళకు సెల్ఫ్ గేమ్ ఆడుతూ…టాస్క్ లలో కూడా సీరియస్ అయి పోతూ చీటికీ మాటికీ ఇంటి సభ్యులపై శాపనార్థాలు పెట్టడం తో ఆయనపై నెగటివ్ ఇంప్రెషన్ బయట పడిపోయింది.

 

ఇదిలా ఉండగా ఇటీవల స్కూల్ పిల్లలు టాస్క్ లో ఆడపిల్ల అని చూడకుండా హారిక జేబులో చేయి పెట్టి చాక్లెట్లు తీసుకోవడం మాత్రమే కాకుండా… అమ్మాయి జోబులో చేయి పెడితే తప్పేంటని ఎదురు ప్రశ్నించటం ప్రేక్షకుల ఆగ్రహానికి కారణమైంది. దీంతో ప్రస్తుతం ఎలిమినేషన్ లో ఉన్న వారందరిలో ఆన్లైన్ పోల్స్ ప్రకారం మెహబూబ్, అమ్మ రాజశేఖర్ తక్కువ ఓట్లతో ఆఖరి స్థానంలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువగా మాత్రం అమ్మ రాజశేఖర్ పై ఎలిమినేషన్ కత్తి వేలాడుతున్నట్లుగా బయట జనాలు చర్చించుకుంటున్నారు.