బిగ్ బాస్ సీజన్ ఫోర్ రియాల్టీ షో చివరి దశకు రావడంతో హౌస్ లో వాతావరణం చాలా రసవత్తరంగా మారింది. ఇంటిలో ఎవరికీ వారు టాప్ ఫైవ్ లో కి వెళ్ళటానికి తెగ ఆరాటపడుతున్నారు. ఈ వారం మినహా ఇంకో మూడు వారాల ఆట మాత్రమే మిగిలి ఉండటంతో బిగ్ బాస్ కూడా చేతిలో ఉన్న సభ్యులకు సరికొత్త టాస్క్ లు ఇస్తూ వేస్తున్న స్ట్రాటజీ లు తలకిందులు చేస్తున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా హౌస్‌లో ఉన్న సభ్యులందరికీ భయపెట్టే ప్రయత్నంలో ఇంట్లో దెయ్యం అనే విధంగా సరికొత్త సెటప్ లతో స్మశానం లో దెయ్యాల కొంప గా మార్చేశాడు. ఈ నేపథ్యంలో గురువారం ఎపిసోడ్ లో ఇంటిలో ఉన్న సభ్యులకు హర్రర్ సినిమాలు చూపించినట్లు ప్రోమో బట్టి తెలుస్తుంది. అయితే ఈ సినిమా చూస్తున్న సమయంలో దెయ్యం జలజ అరియానాను పిలిచి కన్ఫెషన్ రూమ్‌కి పంపింది. అవినాష్‌తో కలిసి అరియానా కన్ఫెషన్ రూమ్‌కి వెళ్లి.. భయంతో పరుగులు పెట్టింది.
ఇక అరియానా భయాన్ని హేళన చేస్తూ సోహైల్, హారిక స్టెప్పులేశారు. ఇదే క్రమంలో అఖిల్, సోహెల్ వంతు కన్ఫెషన్ రూమ్ లో వెళ్లే పరిస్థితి రాగా.. సోహెల్, అఖిల్ బయట నిజమైన దెయ్యాలతో ఆడటం జరిగింది.. అంటూ పెద్ద పెద్ద డైలాగులు వేసి కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్లిన తర్వాత ఇద్దరిని భయంకరమైన సౌండ్ తో లైటింగ్ ఎఫెక్ట్స్ లతో తెగ భయపెట్టారు. దీంతో కన్ఫెషన్ రూమ్ నుండి బయటకు వచ్చినా అఖిల్, సోహెల్.. హౌస్ లో కెమెరా ముందుకు వచ్చి ఈ వీడియోను ప్లే చేయకండని వేడుకున్నారు. ‘గజ్జుమనిపించిడ్రు. బై మిస్టేక్ కూడా ఈ వీడియోలు ఎక్కడా వేయకండి. మా ఇజ్జత్ పోతది. చూడడానికి కండలు తిరిగి ఉన్నాం. కానీ భయంతో వణికిపోయాం’ అంటూ బిగ్‌బాస్‌కు రిక్వెస్ట్ చేశారు.