హౌస్ లో లేడీస్ లో ఇంటిలో ఉన్న మగవాళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా మంచి పోటీ ఇచ్చిన కంటెస్టెంట్ హారిక. దాదాపు ఏడు సార్లు కెప్టెన్ కి పోటీపడి చివరిలో ఎనిమిదోసారి హౌస్ కి కెప్టెన్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా హౌస్ లో మొదటి నుండి హారిక చాలా క్లోజ్ గా అభిజిత్ తో మూవ్ అయిన సంగతి తెలిసిందే.
వీరిద్దరి స్నేహం చూసి సోషల్ మీడియాలో చాలామంది అభిరిక అనే టైటిల్స్ తో రకరకాల వీడియోలు పెడితే ఇద్దరిని సపోర్ట్ చేస్తూ ఉండటం జరిగింది. అంత మాత్రమే కాకుండా అభి అదేవిధంగా హారిక వాళ్ళ తల్లులు కూడా కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా చివరిలో హారిక అభి తో కాకుండా కాస్త అఖిల్ తో క్లోజ్ గా ఉండటంతో రకరకాల కామెంట్లు బయటకు వస్తున్నాయి.
ఇటువంటి నేపథ్యంలో ఇటీవల తాజాగా హౌస్ లో ఇంటి సభ్యులకు బిగ్ బాస్ మీ లో దాగి ఉన్న లేకపోతే దాచుకున్న క్వాలిటీ వచ్చిన మార్పులు చూపించాలి అదే విధంగా ఎమోషన్స్ కూడా చెప్పాలి అని టాస్క్ ఇవ్వటం జరిగింది. దానిలో భాగంగా హారిక వంతు వచ్చేసరికి అభిజిత్ అఖిల్ గురించి తాను ఎందుకు అలా ప్రవర్తించడం జరిగిందో క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో అఖిల్ గురించి మాట్లాడుతూ..అఖిల్ వల్ల తనకు ఫ్లర్ట్ చేయడం తెలుసని తెలిసింది. ఎప్పుడు అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా ఫ్లర్ట్ చేయగలరని అందువల్లే అఖిల్ తో అంత క్లోజ్ అవ్వటం జరిగిందని హారిక క్లారిటీ ఇచ్చింది. ఇక బిజినెస్ గురించి మాట్లాడుతూ.. అభి తో చేసిన జర్నీలో అతని నేచర్ పోసెసివ్ లాంటిదని చెప్పుకొచ్చింది. అందరినీ సమానంగా ట్రీట్ చేస్తారని హారిక క్లారిటీ ఇచ్చింది.