బిగ్ బాస్ 4: మళ్లీ గొడవ స్టార్ట్ ఆ ఇద్దరు టాప్ కంటెస్టెంట్స్ కి..!!

బిగ్ బాస్ తాజా సీజన్ చివరి దశకు చేరుకుంటున్న తరుణంలో హౌస్ లో వాతావరణం నిమిష నిమిషానికి మారిపోతుంది. ఇంటిలో ఉన్న సభ్యులు ఎవరికి వారు టైటిల్ ట్రోఫీ గెలవడానికి ఎక్కడ వెనకడుగు వేయటం లేదు. ప్రస్తుతం ఇంటిలో ఏడుగురు సభ్యులు మాత్రమే మిగిలారు. ఇంకా నాలుగు వారాల ఆట ఉంది. ఇలాంటి తరుణంలో హౌస్ లో బిగ్ బాస్ ఇస్తున్న టాస్క్ లు ఇంటిలో ఉన్న సభ్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.

Bigg Boss Telugu 4, Day 3, September 9, highlights: From Abhijeet's  argument to Akhil's emotional outburst, 'unexpected' incidents in the  episode - Times of Indiaతాజాగా శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమో లో రేస్ టు ఫినాలే మొదలయ్యింది అంటూ శుక్రవారం బిగ్ బాస్ ఇంటిలో ఉన్న సభ్యులకు సరికొత్త షాక్ ఇస్తూ బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో ఇప్పటి దాక కెప్టెన్ అయినా వారిలో ది బెస్ట్, అదేవిధంగా ది వరస్ట్ కెప్టెన్ ఎవరు అంటూ ఇంటిలో ఉన్న సభ్యులు ఎన్నుకోవాలని బిగ్ బాస్ చెప్పటంతో.. మొన్నటి దాకా సైలెంట్ గా ఉన్న హౌస్ ఇప్పుడు గోలగోలగా మారింది.

 

ఈ క్రమంలో చాలా మంది ది వరస్ట్ కెప్టెన్ అరియనా అంటూ కామెంట్లు చేసినట్లు ప్రోమో లో తెలుస్తుంది. అదేవిధంగా టాప్ కంటెస్టెంట్ లుగా బయట చలామణి అవుతున్న పేర్లు అఖిల్, అభిజిత్ ల మధ్య తాజా టాస్క్ అగ్గి రాజేసింది. నేను త్యాగం చేసి ఇంటిలో నుంచి సీక్రెట్ రూమ్ కి వెళ్లినట్లు అఖిల్ తెలపగా, అది త్యాగం కాదు నీకు తెలిసే కావాలనే వెళ్లావు అంటూ అభిజిత్ అనడంతో ఇద్దరి మధ్య గొడవ గట్టిగా జరగటంతో మధ్యలో సోహెల్ వచ్చిన అఖిల్ సీరియస్ అయిపోయారు. దీంతో శుక్రవారం జరగబోయే ఎపిసోడ్ భారీ స్థాయిలో ఉండబోతున్నట్లు ప్రోమో బట్టి సోషల్ మీడియాలో నెటిజన్లు బయట జనాలు చెప్పుకొస్తున్నారు.