సోహెల్.. అసలు కొన్ని నెలల కింద ఈ పేరు ఎవ్వరికీ తెలియదు. కానీ.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి ఒక్కరికి ఈ పేరు సుపరిచితం. దానికి కారణం బిగ్ బాస్. దాదాపు 10 ఏళ్లుగా సోహెల్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ.. సోహెల్ కు అంతగా గుర్తింపు రాలేదు. కానీ.. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లాడో మనోడి కథ అంతా వేరే అయిపోయింది. పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు సోహెల్.

తన ఫ్రెండ్స్ ముందు ఎలా ఉన్నాడో.. తన ఇంట్లో ఎలా ఉన్నాడో… సేమ్ అలాగే బిగ్ బాస్ హౌస్ లోనూ ఉండి.. తెలుగు ప్రేక్షకుల మనసును దోచుకున్నాడు సోహెల్. మనది కల్లు తాగి గుడాలు తినే బ్యాచ్ అంటూ చాలా సార్లు సోహెల్.. బిగ్ బాస్ హౌస్ లోనూ చెప్పాడు.
తాజాగా తన ఫ్రెండ్స్ తో కలిసి తన సొంతూరులో కల్లు తాగుతూ గుడాలు తింటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు సోహెల్. ఫ్రెండ్స్ తో సరదాగా బాత్ కానీలు కొడుతూ.. కల్లు తాగాడు. ఈసందర్భంగా తన బిగ్ బాస్ హౌస్ లోని ముచ్చట్లను కూడా తన ఫ్రెండ్స్ తో పంచుకున్నాడు.
దానికి సంబంధించిన వీడియోను మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి మరి..