Bigg boss 4 : బిగ్ బాస్ 4 Bigg boss 4 సీజన్ పూర్తయినా ఇంకా దాని గురించి చర్చించడం మాత్రం ఆపలేదు జనాలు. అర్రె.. అభిజీత్ కాకుండా.. ఆ వ్యక్తి గెలిస్తే బాగుండేది. అసలు.. ఆ కంటెస్టెంట్ అలా గేమ్ ఆడాల్సింది కాదు. అసలు.. నేనైతే ఆ కంటెస్టెంట్ ఫైనల్స్ కు చేరుకుంటాడనుకున్నాను కానీ బ్యాడ్ లక్. ఇలా.. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్ల గురించి చర్చ జరుగుతూనే ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లు కూడా రోజూ ఏదో ఒక వార్తతో సోషల్ మీడియాలో నానుతూనే ఉన్నారు. చాలా చానెళ్లు తమ షోలలో బిగ్ బాస్ కంటెస్టెంట్లను గెస్టులుగా పిలిచి తమ టీఆర్పీ రేటింగ్స్ ను పెంచుకుంటున్నాయి. అది మరి.. బిగ్ బాస్ కంటెస్టెంట్లకు ఉన్న ఫాలోయింగ్. బిగ్ బాస్ హౌస్ కు వెళ్లకముందు బిగ్ బాస్ కంటెస్టెంట్లను పట్టించుకున్న నాథుడే లేడు. ఎప్పుడైతే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చారో.. వాళ్ల రేంజే మారిపోయింది. అంతా బిగ్ బాస్ మాయ.
Start music షోలో bigg boss 4 contestants
స్టార్ట్ మ్యూజిక్ షోలో బిగ్ బాస్ 4 కంటెస్టెంట్స్ పార్టిసిపేట్ చేశారు. వాళ్లలో సోహెల్, అఖిల్, మెహబూబ్.. ముగ్గురూ గ్లాస్ మెట్స్ అట. అంటే సిట్టింగ్స్ వీళ్లు ముగ్గురే కలిసి వేస్తారట. అందుకే వీళ్లకు గ్లాస్ మేట్స్ అనే పేరు పెట్టింది యాంకర్ సుమ. వీళ్లు ఒక టీమ్.. రెండో టీమ్ గా నోయల్, హారిక, లాస్య.. ఈ ముగ్గురు మరో టీమ్. ఈ రెండు టీమ్స్ కలిసి చేసిన హంగామానే స్టార్ట్ మ్యూజిక్. వీళ్ల హంగామాకు తోడుగా యాంకర్ సుమ యాంకరింగ్ కలిస్తే వినోదానికి కొదువా? దానికి సంబంధించిన ప్రోమో వచ్చేసింది. మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి.