గత సీజన్ లలో హౌస్ లో ఆడించిన టాస్క్ లే మళ్లీ రిపీట్ చేయడం పట్ల విమర్శలు సోషల్ మీడియాలో బయట భారీ స్థాయిలో బిగ్ బాస్ షో నిర్వాహకులపై వస్తున్నాయి. ఎలాంటి కొత్తదనం లేకుండా బిగ్ బాస్ డే కర్ టాస్క్ పట్ల తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అల్లరి బ్యాచ్ అవినాష్, అరియనా, హారిక, అమ్మ రాజశేఖర్ తో వీళ్లంతా చిన్నపిల్లల లాగ మారి… డైపర్లు వేసుకోవటం నవ్వు తెప్పించే విధంగా ఉన్నాగాని… గతంలో ఇదే రీతిలో టాస్క్ ఉండటంతో షో నిర్వాహకులపై బిగ్ బాస్ ఆడియన్స్ మండిపడుతున్నారు.
పసిపిల్లలను మించిపోయేలా అల్లరి చేస్తూ కేర్ టేకర్ గ్రూపు సభ్యులను ఏడిపించడం గత సీజన్లో ఇవే సన్నివేశాలు కనబడటంతో చూస్తున్న ప్రేక్షకులకు కొత్తదనం లేకుండా పోయింది. కాగా పిల్లల చేష్టలు చూస్తున్న ప్రేక్షకులకు కొద్దిగా ఎంటర్టైన్ ఇచ్చే రీతిలోనే ఉన్నాయి. ముఖ్యంగా అరియానా సోహైల్‌ను నాన్న అని పిలుస్తూ అతడి భుజాల మీద ఎక్కి కూర్చుంది.
అలాగే అవినాష్‌తో కలిసి సోహైల్ వీపు మీద కూర్చుని ఏనుగమ్మ ఏనుగు ఆడుకుంది. ఇలా అందరినీ విసిగించే క్రమంలో హారిక మాస్టర్ దగ్గరి నుంచి ఏదో కొట్టేసింది. చాలా వరకూ ఫన్నీ ఫన్నీ గా ఉన్న గాని గతంలో ఉన్న టాస్క్ మాదిరిగానే ప్రస్తుతం ఉండటంతో ప్రేక్షకులు.. బిగ్ బాస్ టీం కొత్త టస్క్ లు ప్రవేశ పెడితే బాగుంటుందని కోరుకుంటున్నారు.