బిగ్ బాస్ హౌస్ లో తన అందచందాలతో నడుము సోయగాలతో సొట్ట బుగ్గల తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న కంటెస్టెంట్ దివి వైద్య. ఏ విషయమైనా ముక్కుసూటిగా మాట్లాడే నైజం కలిగిన దివి టాస్క్ లు కూడా ప్రత్యర్థులకు గట్టిగా పోటీ ఇచ్చేది. కాగా బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అవ్వడానికి కారణం అమ్మ రాజశేఖర్ తో స్నేహమే అనే టాక్ ప్రస్తుతం బయట వినబడుతోంది.
ఈ కారణం వల్లే మోనాల్ కంటే దివికి తక్కువ ఓట్లు పడ్డాయని బయట జనాల డిస్కషన్. ఇదిలా ఉండగా హౌస్ నుండి బయటకు వచ్చిన దీవి పలు టీవీ అండ్ వెబ్ మీడియా ఛానల్స్ కి ఇంటర్వ్యూ మీద ఇంటర్వ్యూ ఇస్తూ ఉంది. ఈ నేపథ్యంలో తన కుటుంబం గురించి అనేక విషయాలు చెప్పుకొచ్చిన దివి తన బ్రేకప్ స్టోరీ గురించి తెలియజేసింది. ఆమె తన బాయ్ ఫ్రెండ్ గురించి ఏమని చెప్పింది అంటే… నా బాయ్‌ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు మలేరియాతో చనిపోయాడు.
ఆ తర్వాత ఒక్కసారిగా వాళ్ల ఇంటిలో పరిస్థితులు మారిపోయాయి. నన్ను పల్లెటూరుకు రమ్మన్నాడు. చిన్నప్పటి నుంచి హైదరాబాద్‌లో పెరిగాను. పల్లెటూరు నాకు అలవాటు లేదు. అయినా కూడా వెళ్లొచ్చు కానీ అప్పటికే మా ఇద్దరికీ రెండు సంవత్సరాలు గ్యాప్ వచ్చింది. పైగా నాకెంతో ఇష్టమైన మోడలింగ్, సినిమాలు వదిలేసుకోమన్నాడు. దీంతో నాకు నచ్చింది నేను చేస్తానని ప్రేమను వదిలేసుకున్నాను” అని దివి చెప్పుకొచ్చింది. సినిమాలు అంటే తనకు చాలా ఇష్టం అని అందుకే ప్రేమను త్యాగం చేసినట్లు తెలిపింది.